Kiran Kumar Reddy: బీసీ రిజర్వేషన్ల పై పోరాటం ఆగదు
Kiran Kumar Reddy (imagecredit:twitter)
Telangana News

Kiran Kumar Reddy: బీసీ రిజర్వేషన్ల పై పోరాటం ఆగదు: కిరణ్​ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: కాంగ్రెస్ పార్టీలో చిన్న సమస్యలు ఉండటం సహజమేనని, అవి టీ కప్పులో తుఫాన్ లాంటివని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ(Konda Sureka) అంశంపై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan), పీసీసీ ప్రెసిడెంట్ చర్చిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఉంటుందని, అందుకే అప్పుడప్పుడు సమస్యలు వచ్చి సర్దుమనుగుతాయన్నారు.

సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్

కాంగ్రెస్ పార్టీలో నియంత పాలన ఉండదన్నారు. ఇక బీసీ బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. కాంగ్రెస్(Congress) చిత్తశుద్ధి తో ఉన్నదని, రాహుల్ గాంధీ(Rahulgandhi) భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జన గణనలో, కుల గణన జరగాలని కోరారన్నారు. కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ కమిషన్ పెట్టి శాస్త్రీయ పద్ధతిలో కుల గణన చేసిందన్నారు. స్థానిక సంస్థల 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయగా, డిస్మిస్ అయిందన్నారు. అందుకే అన్ని పొలిటికల్ పార్టీలతో ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పోరాటం కొనసాగుతుందన్నారు. ఆర్ కృష్ణయ్య పై గురుత్వర బాధ్యత ఉన్నదన్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బండి, కిషన్ రెడ్డి, సంజయ్ ఢిల్లీకి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు పై ప్రధానితో చర్చించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Also Read: BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకై.. తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలి!

దేశంలో ప్రస్తుతం

ఇక ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) సమావేశంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం లో ఎంపీ చామల మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేగవంతమైన భౌగోళిక, ఆర్థిక మార్పులను పూర్తిగా ప్రతిబింబించలేకపోతున్నదన్నారు. అందువల్ల, జనగణన ప్రమాణాల పునఃసమీక్ష కేవలం గణాంక పరమైన అవసరం మాత్రమే కాకుండా, ఆధునిక వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని అది పాలనాపరమైన ఆవశ్యకత అని కూడా కమిటీ సభ్యులు చర్చించినట్తు లెలిపారు.

Also Read: GHMC: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..