DJ Siddardh arrested drugs
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad: డీజే సిద్ధూ.. వీని స్టయిలే వేరు!

– నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం
– పోలీసుల విస్తృత తనిఖీలు, నిఘా
– డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోయిన డీజే సిద్ధార్థ్
– సిద్ధూతోపాటు మరో వ్యక్తికి పాజిటివ్
– ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తింపు
– అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించిన ఎస్ఓటీ
– సిద్ధూ సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల ఫోటోలు
– కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
– మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదులుతుందా?


Hyderabad pub DJ Siddardh arrest : స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: డ్రగ్స్ నివారణకై పోలీసులకు ప్రభుత్వం ఫుల్ హ్యాండ్ ఇవ్వడంతో నిరంతర నిఘా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని పబ్బులపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు తరచూ వెళ్తున్న వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని పిలిచి ఎస్ఓటీ అధికారులు పరీక్షించారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్ట్‌లో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ నిర్వహించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ 40 మందిని పిలిచి విచారించారు. డీజే సిద్ధార్థ్‌తో పాటు స్వరూప్ అనే మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సిద్ధార్థ్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎస్ఓటీ అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. గత కొంతకాలం నుంచి సిద్ధార్థ్ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. గత కొంతకాలంగా డీజే సిద్ధార్థ్, స్వరూప్ కదలికలపై ఫోకస్ పెట్టిన పోలీసులు, పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరితోపాటు ఇంకెవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరి కొంతమంది అనుమానితులపై ఫోకస్ పెట్టారు.

సినీ ప్రముఖులతో డీజే సిద్ధార్థ్ లింక్స్


సిద్దీ బాయ్‌గా పిలిచే డీజే సిద్ధార్థ్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను పరిశీలిస్తే చాలామంది సినీ ప్రముఖులు, అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోలు కనిపిస్తున్నాయి. అతనితో చాలా క్లోజ్‌గా ఫోటోలు దిగారు వీళ్లంతా. దీంతో అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి. అతను డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికిపోవడంతో అతని కాంటాక్ట్ లిస్ట్‌పై పోలీసులు ఫోకస్ చేశారు. లిస్ట్‌లో సినీ ప్రముఖులు ఉంటే ఈ వ్యవహారం మరో సంచలనంగా మారుతుంది. సిద్ధూకు పాజిటివ్ రావడంతో అతనితో క్లోజ్‌గా మూవ్ అయిన వాళ్లు కూడా మత్తు పదార్థాలు సేవించి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రిమాండ్ కు తరలింపు

అబ్దుల్ సోహిల్ కొద్ది రోజులుగా హాష్ ఆయిల్ అమ్ముతున్నాడు. వైజాగ్ కి చెందిన వెంకట్ వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి తెచ్చి ముంబై క్రాఫోర్డ్ మార్కెట్లోని ఓవైసీస్, అక్తర్ లకు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. మరో నిందితుడు నవాజ్ కూడా కొంతకాలంగా అతనికి సాయంగా ఉంటున్నాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 4.7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 44 వేల డబ్బు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పరిచి అనంతరం రిమాండ్ కు తరలించారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

నగరంలో ఎండీఎంఏ డ్రగ్స్‌కు యువత బానిస అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం ఎమ్మెస్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఇద్దరు వ్యక్తుల వద్ద డ్రగ్స్ ఉందనే సమాచారంలో పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వీరు అబ్దుల్ సోహిల్ ఖాన్ (25), సయ్యద్ నవాజ్ (19)గా గుర్తించారు. ఇద్దరి నుంచి 4.7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 44 వేల డబ్బు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు పోలీసులు. డ్రగ్స్‌ నివారణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా పబ్బులపై నిఘా ఉంచినట్టు చెబుతున్నారు.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు