Bigg Boss Telugu 9: కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ ఛాలెంజ్.. ఆయేషా అతి!
Bigg Boss Telugu 9 (Image Source: Youtube)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ ఛాలెంజ్.. ఆయేషా అతి మాములుగా లేదు, ట్విస్ట్ అదిరింది

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) లో 40వ రోజు కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ ఛాలెంజ్ అంటూ కొన్ని ఆసక్తికర టాస్క్‌లు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమోలను తాజాగా బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఈ రెండు ప్రోమోలు చూస్తుంటే.. శుక్రవారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుందనే హింట్‌ని బిగ్ బాస్ ఇచ్చినట్లయింది. మరీ ముఖ్యంగా ఈ వారం ఇద్దరు కెప్టెన్లు అయినట్లుగా చూపించారు. బిగ్ బాస్‌లో ఇప్పటి వరకు జరిగిన సీజన్స్‌లో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్‌ టైమ్‌ హౌస్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారని బిగ్ బాస్ తెలిపారు. ఆ ఇద్దరు ఎవరో కూడా ఈ ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు. కాకపోతే రెండో ప్రోమోలో కెప్టెన్సీ ఛాలెంజ్ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. అసలు ఈ ప్రోమోలలో ఉన్న మ్యాటర్ విషయానికి వస్తే..

Also Read- Jatadhara Trailer: ధన పిశాచిగా సోనాక్షి విశ్వరూపం.. ట్రైలర్ ఎండింగ్ అస్సలు మిస్సవ్వకండి!

కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task)

‘‘కెప్టెన్సీ కోసం ఈ బిగ్ బాస్ ఇంట్లో మొదటిసారిగా.. ఒక్కరు కాదు.. ఇద్దరు కెప్టెన్లు అవ్వబోతున్నారు. ఇప్పుడు కెప్టెన్ అవడానికి పాల్గొనాల్సి టాస్క్.. ‘విడిపించు.. గెలిపించు’. ప్రతి జంటలోని ఒకరు యాక్టివిటీ రూమ్‌లో ఉన్న కాఫీన్ లోపల లాకై ఉంటారు. జంటలోని మరో సభ్యులు.. ఆ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి.. అక్కడ తన పార్టనర్ ఉన్న కాఫీన్‌ని సరైన కోడ్ ఎంటర్ చేసి, విడుదల చేయాలి’’ అని బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు సూచించారు. చాలా ఆసక్తికరంగా ఈ టాస్క్ నడిచింది. ఆయేషా- మాధురి జంట మధ్య ఈ టాస్క్ నడిచింది. మాధురి కాఫీన్‌లో ఉంటే.. ఆయేషా కోడ్ ఎంటర్ చేసి ఆమెను బయటకు తీయాలి. ఈ టాస్క్‌లో మొదటిగా ఆయేషానే కాఫీన్ దగ్గరకు వెళ్లింది కానీ, దానిని ఓపెన్ చేయలేకపోయింది. నా కళ్లజోడు పోయింది, నాకు కనబడలేదు అంటూ భోరుభోరున ఏడ్చేస్తూ.. ఆయేషా చేసిన అతి మాములుగా లేదంటే నమ్మాలి. మాధుకిగా టాస్క్‌లో ఓడిపోయినందుకు ఏడ్చేసింది. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టి (Suman Shetty), గౌరవ్ (Gaurav) కెప్టెన్లు అయినట్లుగా ఈ ప్రోమోని చూస్తుంటే తెలుస్తోంది.

Also Read- CPI Narayana: బిగ్ బాస్ ఒక వ్యభిచార కొంప.. మరోసారి సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్!

కెప్టెన్సీ ఛాలెంజ్ (Captaincy Challenge)

సెకండ్ ప్రోమో విషయానికి వస్తే.. ‘‘మీ దగ్గర ఉన్న కంటెండర్ పవర్ ఉపయోగించి, కెప్టెన్ అయ్యే సమయం వచ్చింది. కొత్తగా ఎన్నికైన కెప్టెన్లలో నుంచి నేరుగా ఒకరిని ఛాలెంజ్ చేయవచ్చు’ అని బిగ్ బాస్ చెప్పగానే గౌరవ్ పేరును నిఖిల్ (Nikhil) చూజ్ చేసుకున్నాడు. ఈ ఛాలెంజ్‌లో గెలిస్తే.. గౌరవ్ స్థానంలో మీరు కెప్టెన్ అవుతారు అని నిఖిల్‌కు బిగ్ బాస్ చెప్పారు. ‘గెలుపు కొరకు – చివరి వరకు’ అంటూ ‘పోటీ దారులు తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కర్రలపై నిలబడి, రోప్స్‌తో కట్టిన వెయిట్ బ్యాగ్స్‌ను హ్యాండిల్స్‌తో లాగుతూ, కాళ్లు కింద పెట్టకుండా, బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. బజర్ మోగిన ప్రతిసారి సంచాలకులు చెప్పిన బ్యాగ్స్‌ను, తాను పిలిచిన ఇంటి సభ్యులు.. కెప్టెన్ అవకూడదనే ఇంటి సభ్యుని రోప్‌కి హుక్ చేయాల్సి ఉంటుంది’ అని చెప్పగానే కొందరు కంటెస్టెంట్స్ వచ్చి హుక్ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఫైనల్‌గా కెప్టెన్ ఎవరయ్యారు? అనేది తెలియాలంటే.. నైట్ వచ్చే షో వరకు వెయిట్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య