Ellamma movie: ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరో నితిన్ కాదా?..
venu-balagam( image:X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ellamma movie: ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరో నితిన్ కాదా?.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Ellamma movie: అప్పటి వరకూ నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటనతో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న కమెడియన్ వేణు బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే తన రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ను దిల్ రాజు బేనర్ లో తెరకెక్కిస్తున్నాడు. 2023లో విడుదలై, కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులు ఆకర్షించిన ‘బలగం’ తర్వాత, వేణు మరో గ్రామీణ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ఎల్లమ్మ’ (Ellamma movie) సినిమా, గ్రామీణ దేవత ఎల్లమ్మను కేంద్రంగా చేసుకుని, ఒక దళిత సముదాయానికి చెందిన పాట సమూహం భావోద్వేగ యాత్రను చిత్రిస్తుంది. ఈ కథలో వారి కలలు, కష్టాలు, ఆధ్యాత్మికత మధ్య సంఘర్షణలు ముఖ్యమైనవి. వేణు, నిజ జీవితాల నుంచి ప్రేరణ పొంది ఈ కథను రూపొందించారు. అయితే ఈ సినిమా హీరో గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Read also-Genuine Movie Review: సినిమాను రివ్యూ చేయాలంటే ఏం తెలియాలి?.. ఎంతమందికి ఇవి తెలుసు?

వేణు దర్శకత్వంలో రూపొందించిన మంచి విజయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అదే తరహాలో మరో కథ సిద్ధం చేసుకున్న దర్శకుడికి హీరో విషయంలో కష్టాలు వీడటం లేదు. మొదట ఈ సినిమాలో హీరోగా నాని అనుకున్నారు అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నితిన్ అనుకున్నారు. అయన కూడా తప్పుకున్నట్లు సమాచారం. మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకున్నారు. తాజాగా ఆయన కూడా కాకుండా సంగీత దర్శకుడు హీరోగా చేయడానికి ఈ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. తాజాగా ఈ సినిమాలో దేవీ శ్రీ హీరో గా చేయనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Read also-Jatadhara Movie: కసబ్ గారూ.. ‘ఓజీ’ సినిమా చూశారా! క్లాసిక్ హారర్ సెటప్‌తో ‘జటాధర’ ప్రమోషన్స్ షురూ!

ప్రొడక్షన్ విషయానికి వస్తే, ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంటటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మించుతుందని అంచనా. కాస్టింగ్ డిలేల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుంది. డీఎస్‌పీ లాక్ అయ్యాక, డిసెంబర్, 2025లో షూట్ స్టార్ట్ కావచ్చు. వేణు యెల్డండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ ఒక ఎమోషనల్ ఫీస్ట్‌గా ఉంటుందని అంచనా. బలగం లాంటి సక్సెస్ కొనసాగితే, ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. తాజా బజ్‌తో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..