Case On Bigg Boss 9 Telugu (Image Source: Youtube)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: దివ్వెల మాధురి, ఆయేషా ఎఫెక్ట్.. బిగ్ బాస్ తెలుగు 9 షో పై కేసు నమోదు.. ఆపేస్తారా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. హౌస్ నుంచి ఇద్దరు బయటకు వస్తే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మరో ఆరుగురిని హౌస్‌లోకి పంపించారు. ఇందులో ముగ్గురు జంట్స్, ముగ్గురు లేడీస్ ఉన్నారు. ఈ ముగ్గురు లేడీస్‌లో దివ్వెల మాధురి, ఆయేషాలు షో‌లో హీట్ మాములుగా పెంచడం లేదు. దివ్వెల మాధురి అసలు ఎవరినీ లెక్క చేయకుండా, తన రూటులో తను నిర్ణయాలు తీసేసుకుంటోంది. కెప్టెన్, సంచాలక్ ఎవ్వరైనా సరే.. తన మాట వినాల్సిందే తప్పితే.. వేరే వాళ్ల మాట తను వినడం లేదు. ఇక ఆయేషా సంగతి చెప్పేదేముంది.. ఫైర్ బ్రాండ్. కమల్ హాసన్ లాంటి వారినే ఆమె ఎదురించి మాట్లాడిన ఘనత ఉంది. ఈ ఇద్దరు హౌస్‌లోకి వెళ్లే ముందే.. రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ఇద్దరూ ఇంట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడీ రచ్చ నచ్చిన వారు, ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Tilak Varma: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సెట్‌లో ఆసియా కప్ హీరోకు అపూర్వ గౌరవం.. ఫొటోలు వైరల్

విలువలు దిగజారేలా చేస్తున్నారు

తెలంగాణ, గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ అనే వారు మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ రియాలిటీ షోపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు ఒక లెక్క, వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చిన తర్వాత ఒక లెక్క అనేలా ఈ షో మారిందని, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసేలా ఈ షో లేదని, రోజురోజుకూ దిగజారిపోతుందని, దీనిపై వెంటనే యాక్షన్ తీసుకుని, ఈ షోను నిలిపివేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా బిగ్ బాస్ యాజమాన్యం ఈ షో‌తో వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారని, దివ్వెల మాధురి, రీతూ.. ఇలా ఎవరిని పడితే వారిని ఈ షోలోకి తీసుకొచ్చి, విలువలు దిగజారేలా చేస్తున్నారని, సమాజం సిగ్గుపడేలా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపినట్లుగా సమాచారం.

Also Read- Daggubati Family: విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందే- ద‌గ్గుబాటి హీరోల‌పై నాంప‌ల్లి కోర్టు సీరియ‌స్‌

బిగ్‌బాస్ హౌస్‌‌ని ముట్టడిస్తాం

అంతేకాదు, ఈ షోను వెంటనే నిలిపివేయకపోతే.. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి వచ్చి బిగ్‌బాస్ హౌస్‌‌ని ముట్టడిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా కింగ్ నాగార్జునను ఉద్దేశించి కూడా వారు ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ షో‌ని హోస్ట్ చేస్తున్న నాగార్జున వెంటనే ఈ రియాలిటీ షోను వదిలేసి, సమాజానికి ఉపయోగపడేలా ఏవైనా కార్యక్రమాలు చేయాలని సూచిస్తూ.. కర్ణాటకలో నిలిపి వేసినట్లుగా వెంటనే ఇక్కడ కూడా బ్యాన్ చేయాలని వారు ఈ ఫిర్యాదులో పోలీసును కోరారు. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. మరోవైపు కర్ణాటక‌లో బ్యాన్ చేసినా, వెంటనే మళ్లీ ఈ షో‌ను పునరుద్ధరించారు. అలాగే, తెలుగు బిగ్ బాస్‌పై సీపీఐ నేత నారాయణ కూడా ఎప్పటి నుంచో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. అయినా కూడా ఈ షో ఆగలేదు. మరి గజ్వేల్ కుర్రాళ్లు కేసు పెడితే ఈ షో ఆగుతుందా? అంత ఈజీ అయితే కాదనే చెప్పుకోవాలి. చూద్దాం.. ఏం జరుగుతుందో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!