Tilak Varma: క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన యువ ఆటగాడు, ఆసియా కప్ (Asia Cup) ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన తిలక్ వర్మ (Tilak Varma)కు మెగాస్టార్ చిరంజీవి అపూర్వ గౌరవాన్ని అందించారు. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న తన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న వేళ, చిరంజీవి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి తిలక్ వర్మను అభినందించారు. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు, ఆ మ్యాచ్ చూసిన వారంతా తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌తో తిలక్ వర్మ హీరో అయిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ఆయనను ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి సత్కరించి, అభినందించారు.
Also Read- Daggubati Family: విచారణకు హాజరు కావాల్సిందే- దగ్గుబాటి హీరోలపై నాంపల్లి కోర్టు సీరియస్
ఆసియా కప్ హీరోకు హృదయపూర్వక స్వాగతం
పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత ఒత్తిడిలోనూ చెక్కు చెదరని నిలకడ, ప్రతిభతో తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి, భారత జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న తిలక్ వర్మను, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి.. తన సినిమా సెట్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. తొలి ప్రయత్నంలోనే దేశానికి గెలుపు రుచి చూపించిన తిలక్ వర్మను చిరంజీవి శాలువాతో సత్కరించారు. కేక్ కట్ చేయించి, సెలబ్రేట్ చేశారు. అంతేకాకుండా, ఆసియా కప్‌లో అతని చారిత్రక మ్యాచ్-విన్నింగ్ క్షణాన్ని బంధించిన ప్రత్యేక ఫొటో ఫ్రేమ్‌ను బహుకరించారు.
మనస్పూర్తిగా అభినందనలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తిలక్ ప్రదర్శించిన నిబద్ధత, క్రమశిక్షణ, భయం లేని స్ఫూర్తి క్రీడా మైదానంలోనే కాక, జీవితంలో కూడా అత్యంత ముఖ్యమైనవి. ఈ యువ ప్రతిభను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను’’ అని ప్రశంసించారు. ఈ గౌరవప్రదమైన సన్మాన వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులైన హీరోయిన్లు నయనతార, కేథరిన్ థ్రెసా.. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కూడా పాల్గొని తిలక్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. భారత సినీ పరిశ్రమలోని అత్యంత గొప్ప ఐకాన్లలో ఒకరిగా నిలిచిన చిరంజీవి చేతుల మీదుగా గుర్తింపు పొందడం తిలక్ వర్మకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణమని భావించవచ్చు. ఇతరులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉండే చిరంజీవి.. ఈ రూపంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా.. మెగాస్టార్ చిరంజీవి, తిలక్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Megastar #Chiranjeevi Garu met young cricket sensation #TilakVarma on the sets of #ManaShankaraVaraPrasadGaru and felicitated him for his stellar contribution to India’s glorious win against Pakistan. 🏏💫
A proud moment as the Megastar appreciated the Hyderabad boy’s talent,… pic.twitter.com/9HVOg2ZRy4
— Team Megastar (@MegaStaroffl) October 16, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
