Seethakka: ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
Seethakka( IMAGE CREDIT: TWITTER)
Telangana News

Seethakka: ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. సీతక్క కీలక వ్యాఖ్యలు

Seethakka: హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్‌ (హ్యామ్) ప్రాజెక్టు అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క (Seethakka) తెలిపారు. ఈ హ్యామ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అని పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, రవాణా సౌకర్యాలు విస్తృతంగా మెరుగుపడతాయని తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టుల కోసం టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుందని, టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫేజ్–I లో 17 ప్యాకేజీల కింద, 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కిలోమీటర్ల పొడవుతో) నిర్మించనున్నామని తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ ర‌హదారి నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనాలని సూచించారు.

Also Read: Seethakka: మేడారం చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్న పనులు.. మంత్రి సీతక్క వెల్లడి!

ప్రాజెక్ట్ వ్యయానికి 40% ప్రభుత్వమే నిర్మాణ దశ

గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రం, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర- కేంద్రం వరకు రహదారి కనెక్టివిటీని పెంచేందుకు హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్‌ పద్ధతిలో నిర్మాణం, అప్‌గ్రేడేషన్‌, నిర్వహణ చేపట్టేందుకు సంక‌ల్పించిందన్నారు. ఈ విధానంలో లో ప్రాజెక్ట్ వ్యయానికి 40% ప్రభుత్వమే నిర్మాణ దశలో చెల్లిస్తుందని, మిగిలిన 60% మొత్తాన్ని కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారని, రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే అవుతుందన్నారు.

ఫేజ్ – I కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ

ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఫేజ్ – I కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేశారు. ప్రభుత్వం 17 ప్యాకేజీలుగా పీఆర్ ఇంజ‌నీరింగ్ డిపార్ట‌మెంటు సర్కిళ్ల వారీగా పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ప్రాజెక్ట్ యొక్క మొత్తం అంచనా వ్యయం రూ. 6,294.81 కోట్లుగా ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక అనుమతి మంజూరైంది. దీంతో ఫేజ్ – I హ్యామ్ రోడ్ల‌ టెండర్ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులిచ్చింది.

Also Read: Seethakka:పేదరికంపై తుది పోరులో విజ‌యం సాధిస్తాం.. సీతక్క కీలక వ్యాఖ్యలు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..