kannappa-tv( image ;X)
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Television Premiere: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైన ‘కన్నప్ప’.. ఎప్పుడంటే?

Kannappa Television Premiere: హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నటించి రూపొందించిన ‘కన్నప్ప’ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డా.ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే థయేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, మీడియా, సోషల్ మీడియాల నుంచి ‘కన్నప్ప’ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఓటీటీలో కన్నప్ప చిత్రం రిలీజ్ అయిన తరువాత కూడా టాప్‌లో ట్రెండ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. ఈ మేరకు టీం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువకానుంది.

Read also-D’Angelo death: గ్రామీ అవార్డు గ్రహీత కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం..

దీపావళి సందర్భంగా ఈ మూవీని జెమినీలో అక్టోబర్ 19న ప్రీమియర్‌గా మధ్యాహ్నం 12 గంటలకు ‘కన్నప్ప’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇక సన్ నెట్వర్క్ లో 8 ఏళ్ల తరువాత నాలుగు భాషల్లో ఓ సినిమాని ఒకే సారి స్ట్రీమింగ్ చేయడం విశేషం. ‘కన్నప్ప’ చిత్రంతో ఈ పండుగను మరింత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా స్ట్రీమింగ్‌ను ప్లాన్ చేశారు. న్యూజిలాండ్ అందాలతో ‘కన్నప్ప’ విజువల్ వండర్‌గా మారనుంది. స్టీఫెన్ దేవస్సీ అందించిన సంగీతం ఇప్పటికే చాట్ బాస్టర్ గా నిలిచింది. ప్రభు దేవా నృత్యాలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌ను మెప్పించి ఈ సినిమాను తారా హిట్ రేంజ్ కు తీసుకెళ్లాయి.

Read also-Kottalokha OTT release: ఎట్టకేలకు ఓటీటీలోకి ‘కొత్త లోక చాప్టర్ 1’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘కన్నప్ప’ సినిమా హిందూ పురాణాల్లోని కన్నప్ప నాయనార్ లెజెండ్‌పై ఆధారపడి ఉంది. విష్ణు మంచు నటించిన తిన్నాడు అనే గిరిజన వేటగాడు, బాల్యంలో జరిగిన ఒక ట్రామాకు గురై దేవతలు, ఆరాధనలు అన్నీ తిరస్కరిస్తాడు. అతడు జీవితాన్ని ఇన్‌స్టింక్ట్‌తో, యుద్ధాలు, ప్రేమలతో గడుపుతాడు. ప్రీతి ముఖుంధన్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. తిన్నాడు శివలింగం దగ్గరకు చేరుకుని, మొదట అవమానిస్తాడు కానీ క్రమంగా భక్తిమయుడవుతాడు. అతడి భక్తి పరీక్షల్లో త్యాగాలు చేస్తాడు. క్లైమాక్స్‌లో కళ్ళు పైకప్పడి శివుని భక్తితో మోక్షం పొందుతాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ కెమియోలు ఆకట్టుకుంటాయి. భక్తి, త్యాగం థీమ్‌లు ప్రధానం. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!