d'angelo ( Image :X)
ఎంటర్‌టైన్మెంట్

D’Angelo death: గ్రామీ అవార్డు గ్రహీత కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం..

D’Angelo death: గ్రామీ అవార్డు గెలుచుకున్న ఆర్‌బీ అండ్ బీ సింగర్ డి’ఆంజెలో మరణించాడు. 51 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌తో పోరాడుతూ అతను కన్నుమూశాడు. అతని గొప్ప మెలడీలు, హృదయాన్ని తాకే గీతాలు నియో-సోల్ సంగీతాన్ని మార్చాయి. ‘అన్‌టైటిల్డ్ (హౌ డజ్ ఇట్ ఫీల్)’, ‘బ్రౌన్ షుగర్’ వంటి పాటలు అతని గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అతని ఫ్యాన్స్, సంగీతకారులు విచారంలో మునిగారు. సంగీత ప్రపంచంలో అతని ప్రభావం ఎప్పటికీ ఉంటుందని ఆయన కుటుంబం తెలిపింది. “మా కుటుంబంలో ఒక మెరిసే స్టార్ మా జీవితాల్లో తన కాంతిని మసకబార్చాడు. అతని అద్భుతమైన సంగీత వారసత్వానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులం” అంటూ ఆయన కుటుంబం విచారం వ్యక్తం చేసింది. ఆయన అసలు పేరు మైఖేల్ యూజీన్ ఆర్చర్. 1990ల్లో హిప్-హాప్, సోల్, గాస్పెల్ సంగీతాలను కలిపి నియో-సోల్‌ను ప్రారంభించాడు. అతని మృదువైన స్వరం, ‘అన్‌టైటిల్డ్’ వీడియోతో ప్రసిద్ధి చెందాడు.

Read also-Kottalokha OTT release: ఎట్టకేలకు ఓటీటీలోకి ‘కొత్త లోక చాప్టర్ 1’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

1995లో వచ్చిన మొదటి ఆల్బమ్ ‘బ్రౌన్ షుగర్’కు ఇటీవల 30 ఏళ్ల వార్షికోత్సవం జరిగింది. ‘లేడీ’, ‘బ్రౌన్ షుగర్’ పాటలు భారీ హిట్. ఈ ఆల్బమ్ అతనికి అనేక గ్రామీ అవార్డులు తెచ్చి పెట్టాయి. ఆర్‌బీలో అతను ప్రత్యేక వాయిస్‌గా మారాడు. ‘అన్‌టైటిల్డ్’ వీడియో బ్లాక్ మగవాళ్లలో కళా, లైంగికత, బలహీనతలపై చర్చలు రేగించింది. ఈ పాటకు బెస్ట్ మేల్ ఆర్‌బీ వోకల్ పెర్ఫార్మెన్స్ గ్రామీ వచ్చింది. తర్వాత వచ్చిన ‘వూడూ’ ఆల్బమ్ బిల్‌బోర్డ్ 200లో మొదటి స్థానం సాధించి, బెస్ట్ ఆర్‌బీ ఆల్బమ్ గ్రామీ గెలిచింది.

1990ల్లో ఆర్‌బీ సింగర్ ఆంజీ స్టోన్‌తో ఆయనకు ఎనలేని సంబంధం ఏర్పడింది. ‘బ్రౌన్ షుగర్’ ఆల్బమ్ తయారు చేస్తున్నప్పుడు ఆమెన్ మొదటి సారి కలుసుకున్నాడు. ఆమె అతని ‘ఎవరీడే’ పాటలో సహాయం చేసింది. ఆమె అతన్ని తన “సంగీత సోల్‌మేట్” అని పిలిచింది. వారికి మైఖేల్ ఆర్చర్ జూనియర్ (స్వేవో ట్వైన్) అనే కుమారుడు ఉన్నాడు. ఆంజీ స్టోన్ ఈ ఏడాది మార్చిలో కారు ప్రమాదంలో 63 ఏళ్ల వయస్సులో మరణించింది. డి’ఆంజెలోకు ఇమాని ఆర్చర్ అనే కూతురు కూడా ఉంది. ఆమె కూడా సంగీతకారిణి.’వూడూ’ తర్వాత 10 ఏళ్లకు పైగా సంగీతం నుంచి దూరంగా ఉన్నాడు. 2014లో ‘ది వ్యాంగార్డ్’ బ్యాండ్‌తో ‘బ్లాక్ మెస్సయా’ ఆల్బమ్‌తో తిరిగి వచ్చాడు. బిల్‌బోర్డ్ 200లో 5వ స్థానం. బెస్ట్ ఆర్‌బీ ఆల్బమ్ గ్రామీ గెలిచింది. ‘రియల్లీ లవ్’ పాట బెస్ట్ ఆర్‌బీ సాంగ్ గ్రామీ, రికార్డ్ ఆఫ్ ది ఈయర్ లలో పేరు తెచ్చింది.

Read also-Tollywood trolling: టాలీవుడ్ లో ఒక మూవీ టీంపై ఇంకో మూవీ టీం ట్రోలింగ్స్ చేసుకుంటాయా?.. ఇందులో నిజమెంత?

ఇటీవలి వార్తలు: 2025 మేలో ఫిలడెల్ఫియాలోని రూట్స్ పిక్నిక్ కాన్సర్ట్‌లో ప్రధాన కళాకారుడిగా రాణించాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ సంవత్సరం మొదట సర్జరీతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా క్యాన్సిల్ చేశాడు. డాక్టర్లు పెర్ఫార్మెన్స్ చేస్తే సమస్యలు మరింత పెరుగుతాయని చెప్పారు. డి’ఆంజెలో వదిలిన సంగీత వారసత్వం ఎప్పటికీ జీవించి ఉంటుంది. అతని పాటలు భావోద్వేగాలు, కళాత్మకతతో తరాలను ప్రేరేపిస్తాయి. ఫ్యాన్స్, సంగీత ప్రపంచం అతన్ని గుర్తుంచుకుంటారు. అంటూ అతని కుటుంబం చెప్పుకొచ్చారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!