Kottalokha OTT release: లేడీ సూపర్ హీరో జానర్లో వచ్చిన మళయాళ బ్లాక్ బస్టర్ సినిమా ‘కొత్తలోక చాప్టర్ 1’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనిని ఓటీటీ సంస్థ జియే హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా తెలపలేదు. కొన్ని అంచనాల ప్రకారం ఈ సినిమా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రానుండటంతో ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మలయాళంలో ఒక కొత్త యుగాన్ని ప్రారంభించిన చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’. ఈ సూపర్‌హీరో సాగా, కేరళ ఫోక్‌లోర్, మిథాలజీని ఆధారంగా చేసుకుని, హాలివుడ్ స్టైల్‌లో ఈ సినిమాను రూపొందించారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కలిసి నటించిన ఈ సినిమా, ఆగస్టు 28, 2025న తెలుగు, తమిళం, కన్నడం, హిందీలలో విడుదలై రికార్డులు సృష్టించింది.
Read also-Venu Swamy puja: తాంత్రిక పూజలు చేస్తూ మరోసారి వైరల్ అయిన వేణు స్వామి .. ఏకిపారేస్తున్న నెటిజన్లు..
సినిమా కథ మొత్తం చంద్ర (కళ్యాణి ప్రియదర్శన్) చుట్టూ తిరుగుతుంది. స్వీడన్ నుంచి కర్ణాటకలోకి వచ్చిన ఆమె, అసాధారణ శక్తులతో కూడిన యక్షిగా ఉంటుంది. ఆర్గాన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌తో ఎదుర్కొన్న ఆమె పోరాటం, సన్నీ (నస్లెన్) అనే యువకుడితో ప్రేమ కథను కలిపి, ఆసక్తికరంగా ఉంటుంది. కథలో కల్లియంకట్టు నీలి అనే ట్రైబల్ గర్ల్ లెజెండ్, కడమట్టత్తు కతనార్ వంటి ఫోక్‌లోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చంద్ర రహస్యాలు, ఆమె బలహీనతలు (సూర్యకాంతి, రక్త అవసరం) కథకు డెప్త్ ఇస్తాయి. ఇలా సాగిన కథ మళయాల సినిమా ఇండస్ట్రీలో చరిత్ర తిరగరాసింది. చిన్న బడ్జెట్ తో విడుదలై అఖండ విజయం సాధించింది.
ఈ సినిమా విడుదలైన తర్వాత రూ.300 కోట్లు వసూలు చేసి, 2025లో అత్యధిక గ్రాస్ చేసిన మలయాళ చిత్రంగా నిలిచింది. మొదటి వీకెండ్‌లో రూ.65 కోట్లు, ఒక వారంలో రూ.100 కోట్లు సాధించింది. విమర్శకులు వరల్డ్-బిల్డింగ్, విజువల్స్, కళ్యాణి పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసించారు. ప్రస్తుతం మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ను చూసేందుకు సూపర్‌హీరో ఫ్యాన్స్ ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ డొమినిక్ అరుణ్ రాసి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రం, డుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిల్మ్స్ పతకం పై రూపొందింది. రూ.30 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద రూ.300 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నిమిష్ రవి కెమెరా, జేక్స్ బెజాయ్ మ్యూజిక్, యానిక్ బెన్ యాక్షన్ కోరియోగ్రఫీ బాగా పని చేశాయి.
The beginning of a new universe.
Lokah Chapter 1: Chandra — coming soon on JioHotstar.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#Lokah #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun #KalyaniPriyadarshan #Naslen #SuperheroFantasy… pic.twitter.com/BMlsbEJM0q
— JioHotstar Malayalam (@JioHotstarMal) October 14, 2025
