Kavitha-Politics
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Kavitha Politics: కేసీఆర్ ఫొటో తీసేసిన కవిత!.. జాగృతి శ్రేణులకు కీలక సూచన

Kavitha Politics: కవిత ఫ్రేమ్‌లో కేసీఆర్ ఫొటో అవుట్

కేవలం జయశంకర్ ఫొటోతోనే ఇకపై జాగృతి
ఈ నెల చివరి వారం నుంచి జిల్లాల పర్యటనకు కవిత
ప్రతి జిల్లాలో రెండ్రోజుల టూర్
అన్ని జిల్లాలో పర్యటించేలా షెడ్యూల్
సొంత జిల్లాతో ప్రారంభం.. హైదరాబాద్‌తో ముగింపు
నాలుగు నెలలు సాగనున్న యాత్ర
ఇక స్పీడ్ పెరగనున్న జాగృతి కార్యకలాపాలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కల్వకుంట్ల కవిత (Kavitha Politics) ఇన్నాళ్లూ తన తండ్రి కేసీఆర్ ఫొటోతోనే తెలంగాణ జాగృతి సంస్థ కార్యకలాపాలు చేపట్టారు. జాగృతి రాష్ట్ర కార్యాలయంలో కేసీఆర్ , జయశంకర్ ఫొటోలు ఏర్పాటు చేశారు. అయితే ఇకపై ఆమె చేపట్టబోయే కార్యక్రమాల్లో కేసీఆర్ ఫొటో కనిపించదు. కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫొటో మాత్రమే ప్రత్యక్షం కానుంది. ఈ నెల చివరలో రాష్ట్ర వ్యాప్త చేపట్టబోయే యాత్రకు రూపొందించిన వాల్ పోస్టర్‌లోనూ కేసీఆర్ ఫొటోకు స్థానం కల్పించలేదని సమాచారం. ఇప్పటివరకు తనతండ్రి కేసీఆర్ రాజకీయ గురువు అని చెప్పుకుంటున్న కవిత.. ఒక్కసారి కేసీఆర్ ఫొటోను తొలగించడం వెనుక ఆంతర్యమేంటనేది త్వరలోనే స్పష్టత రానున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ సోషల్ మీడియా, పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించకపోవడమా?, లేకుంటే ప్రత్యర్థులకు విమర్శల అవకాశం ఇవ్వకుండా పక్కా ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

జాగృతి సంస్థ బలోపేతంలో భాగంగానే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల చివరి వారం నుంచి పర్యటనలకు ప్లాన్ చేశారు. ప్రతి జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మేధావులు, కవులు, కళాకారులు, నిరుద్యోగులు, యువత, మహిళా, విశ్రాంత ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో భేటి అయ్యి సమస్యను తెలుసుకోబుతున్నట్లు సమాచారం. ఆయా జిల్లాలోని ప్రధాన సమస్యలు తెలుసుకొని వాటిని నివేదిక రూపంలో పొందుపర్చనున్నట్లు సమాచారం. ప్రాధాన్యత క్రమంలో ఆ సమస్యలపై పోరాటం బాటపట్టనున్నట్లు తెలిసింది.

కవిత సొంత జిల్లా నిజామాబాద్. అక్కడి నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడి నుంచే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2020లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నికయ్యారు. రెండోసారి అక్కడి నుంచే ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో జిల్లాల యాత్రను నిజామాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ లో యాత్ర ముగింపు సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ యాత్ర మొత్తం 4 నెలల పాటు సాగనున్నట్లు సమాచారం. ఒక వైపు యాత్ర, మధ్యలో జాగృతి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

Read Also- Kavitha: గ్రూప్-1 విద్యార్థులకు అన్యాయం చేయొద్దు.. గత ప్రభుత్వం చేసినందుకే ఓడించారు.. కవిత కీలక వ్యాఖ్యలు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ను సిద్ధం చేసుకునేందుకే యాత్రకు శ్రీకారం చుట్టినట్లు విశ్వసనీయ సమాచారం. క్షేత్రస్థాయి వరకు జాగృతిని బలోపేతం చేయడం, ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ కమిటీలు వేశారు. అయితే పూర్తిస్థాయిలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాగృతితో పాటు అనుంబంధ సంఘాల కమిటీలు వేయబోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను జాగృతి చేయడం, జాగృతి కార్యకలాపాలను తెలియజేస్తూ వారిని యాక్టీవ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోకుండా పోరాట బాటపట్టాలని, ప్రజలను సైతం నిత్యం అలర్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారంతో కవిత మరింత యాక్టీవ్ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందుకే తొలుత కేసీఆర్ ఫొటో ను జాగృతి కార్యక్రమాలకు దూరం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. తను స్వతహాగా ఎదిగేందుకు.. రాజకీయాల్లో తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు. నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నిలకు సన్నద్ధమవుతున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. ఏదీ ఏమైనా తెలంగాణ జాగృతి స్పీడ్ తో కొన్ని పార్టీలకు గండిపడే అవకాశం లేకపోలేదు.

బుధవారం పోస్టర్ ఆవిష్కరణ

జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టబోయే రాష్ట్ర వ్యాప్త యాత్ర పర్యటన పోస్టర్ ను బుధవారం జాగృతి కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నారు. 33 జిల్లాలో కవిత యాత్ర సాగనుంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీ సభ్యులకు రావాలని సూచించారు. యాత్ర పోస్టర్ ఆవిష్కరణ తర్వాత కీలక వ్యాఖ్యలు చేయబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? లేకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులపై స్పందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also- Child Protection: ఉన్నత లక్ష్యంతో క్రమశిక్షణతో చదవాలి.. బాలల సంరక్షణ లీగల్ అధికారి!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!