- భారత్ లో పెరిగిపోతున్న రాజకీయ వారసత్వం
- 1999 నుంచి అనూహ్యంగా పెరిగిపోయిన వారసత్వాలు
- కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో పెరుగుతున్న వారసులు
- 2014 లోక్ సభ ఓన్నికలలో కాంగ్రెస్ నుంచి 36 మంది వారసులు
- బీజేపీ నుంచి పోటీచేసిన 31 మంది రాజకీయ వారసులు
- 2004 ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ 20 శాతం, బీజేపీ 10 శాతం అభ్యర్థులు
- 2024 సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి 209 మంది వారసుల పోటీ
- జూన్ మూడవ ఆదివారం (16 జూన్) ఫాదర్స్ డే
successors in Indian Politics increased following their fathers:
తండ్రి కోసం ప్రత్యేకంగా ఓ రోజు అంటూ జరుపోవాల్సిన పనిలేదు. ఆయనను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ప్రతిరోజూ ఆయనదే. ప్రతి గుర్తింపూ ఆయనదే. కుటుంబంలో ఓ ప్రత్యేక హోదా కూడా ఆయనదే. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి అనగానే ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగివుంటాడు. జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాల గురించి తెలుసుకుందాం..
తండ్రుల కోరిక మేరకే..
కొడుకులకు రాజకీయాలలోకి రావాలని లేకున్నా..తండ్రులకు మాత్రం తన వారసుడు లేక వారసురాలు తనకి మించిన రాజకీయ వేత్తలు కావాలని కోరుకుంటుంటారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు వేర్వేరు పార్టీలనుంచి పోటీపడిన సందర్భాలు కూడా చూస్తుంటాం. ఏది ఏమైనా తన రాజకీయ జీవితానికి తొలి గురువు తన తండ్రే అని సగర్వంగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా, ఏ పార్టీలో చూసినా వారసత్వ రాజకీయాలే కనిపిస్తున్నాయి. 1999 లో జరిగిన లోక్ సభ ఎన్నికల నుంచి ఈ వారసత్వ రాజకీయాలు పెరిగాయి. తర్వాత 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల వరకూ ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలలో 36 మంది వారసత్వ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఈ విషయంలో బీజేపీ సైతం తక్కువేం కాదు. బీజేపీ ఎంపీలలో 31 మంది వారసత్వ రాజకీయాలనుంచి వచ్చినవారే. 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి 8 మంది రాజకీయ వారసులు నెగ్గారు. బీజేపీ నుంచి ఆరు శాతం మంది ఎన్నికయ్యారు. ఇక 2004 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి 20 శాతం, బీజేపీ నుంచి 10 శాతం మంది వారసులు ఎన్నికయ్యారు.
ప్రతి నలుగురిలో ఒకరు
ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి నలుగురు బీజేపీ, కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల్లో ఒకరు తమ కుటుంబ వారసత్వం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిపి 768 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా వారిలో 209 మంది రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు. వీరిలో ఎక్కువ మంది రెండో తరం రాజకీయ నాయకులే కావడం గమనార్హం. వంశపారంపర్య రాజకీయాలను విపక్షాలు ప్రోత్సహిస్తాయని తరచుగా విమర్శించే అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొన్నటి ఎన్నికల్లో అది నిలబెట్టిన 442 మంది అభ్యర్థులలో 110 మంది (24.88 శాతం) రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉండటం గమనార్హం. కాంగ్రెస్ విషయానికి వస్తే, దాని 326 మంది అభ్యర్థులలో 99( 30.36 శాతం) మంది రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉన్నారు.
ఆర్థిక వనరుల ప్రభావం
గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడం అనేది డబ్బులతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఆర్థికంగా స్థిరంగా ఉన్న అభ్యర్థులు పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక వనరులు, ప్రభావవంతమైన నెట్‌వర్క్‌లు, ప్రచారాల ఖర్చులకు అధిక మొత్తంలో ఆర్థిక వనరులు అవసరం అవుతాయి. ఇలాంటి తరుణంలో సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ముఖ్యంగా రాజవంశ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఇలాంటివి పొందడం చాలా సులువు కావడంతో వారు పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది.