Meher Ramesh: ‘ఓజీ’ హిట్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత తీయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో బజ్ నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రముఖ దర్శకులు కూడా ఆయనతో సినిమా తీయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. తాజాగా స్టార్ దర్శకుడు మెహర్ రమేశ్ పవన్ తో సినిమా తీసేందుకు ఇప్పటికే రెండు సార్లు ఆయన్ను కలిశారని తెలుస్తోంది. ఎలాగోలా సినిమా కోసం ఒప్పించేందుకు ఈ దర్శకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు తీస్తారా లేదా అన్నదని గురించి ఆయన క్టారిటీ ఇవ్వలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ షూట్ ఇప్పటికే కంప్లీట్ చేసేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ సినిమాలు చేయడంలేదు. ఉస్తాద్ మరో షెడ్యూల్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడని కూడా ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.
Read also-Sanjay Kapur: సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారంలో మరో మలుపు.. అసలు పిల్లులు ఎవరంటే?
పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం మెహర్ రమేశ్ చేస్తున్న ప్రయత్నాన్ని చూసిన ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ప్లాప్ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన మెహర్ రమేశ్ ప్రాజెక్టుకు కనుక పవన్ కళ్యాణ్ ఒప్పకుంటే.. సినిమా ఫలితం వేరే విధంగా ఉంటుందని ఫ్యాన్ కంగారు పడుతున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాతో కోలుకోలేని దెబ్బ తగిలిన పవన్ కు ‘ఓజీ’ కొంత ఉపశమనం కలిగించింది. మళ్లీ మెహర్ తో సినిమా అంటే ఈ సారి భరించలేం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఉందని దిల్ రాజు ప్రకటించగా ఇప్పుడు దర్శకుడు మెహర్ రమేశ్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే ఎలా ఉండబోతుందో అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గాబరా పడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అసలు ఓకే అవుతుందో లేదో చూడాలి మరి.
Read also-Ayesha Zeenath: బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ శివంగి గురించి తెలుసా..
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదలై, మొదటి రోజు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. 19 రోజుల్లో ఇండియా నెట్ రూ.192.12 కోట్లు వసూలు చేసి, 2025లో టాప్ తెలుగు ఫిల్మ్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 13వ రోజు రూ.300 కోట్లు దాటి, 200 కోట్ల మార్క్‌ను ముందుగానే దాటేసింది. 18వ రోజు రూ.1.34 కోట్లు, 19వ రోజు రూ.0.49 కోట్లు వసూలు. ‘కాంతార 2’ పోటీతో కూడా స్థిరంగా రాణిస్తూ, పవన్ కెరీర్‌లో అత్యధిక గ్రాసర్‌గా మారింది. అభిమానుల మానియాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.
