Bachupally Land Scam: బాచుపల్లిలో బడా భూస్కాం..!
Bachupally Land Scam (imagecredit:swetcha)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Bachupally Land Scam: బాచుపల్లిలో బడా భూస్కాం.. పైల్ డీ నోటిఫై చేసేందుకు అధికారుల తంటాలు


Bachupally Land Scam: బాచుపల్లి సీలింగ్ ఫైల్ మిస్సింగ్ కథ ముగియక ముందే రికార్డులు ట్యాంపరింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. సీలింగ్ ఫైల్స్‌ను తారుమారు చేస్తే వందల ఎకరాలు తమ సొంతం అవుతుందని భావిస్తున్న కబ్జారాయుళ్ల తీరుకు ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు ఉన్నాయి. అందుకు అనుకూలంగా రికార్డులు ఏమార్చి, మైరాన్(Myron) అనే రియల్ ఎస్టేట్ కంపెనీ(Real estate company)కి మేలు చేసేలా రిపోర్టులు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం నుంచి ఒత్తిడి మొదలైంది. ఎన్నో ఏండ్లుగా వివాదంలో ఉన్న ఈ ఫైల్స్‌ను ఎలా మారుస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఉన్నందున మేడ్చల్ కలెక్టర్ నిషేదిత జాబితాలో (22 ఏ) చేర్చారు. ఆ వివాదం ముగయకుండానే కొంతమంది తమకున్న పలుకుబడితో ఒక్కొక్కటిగా డీ నోటిఫై చేసేందుకు కిందిస్థాయి అధికారులను ఇబ్బంది పెడుతున్నారు.

కలవర పెడుతున్న కలెక్టర్ లేఖ

మేడ్చల్(Medhal) కలెక్టర్ కార్యాలయం నుంచి బాచుపల్లి తహశీల్దార్‌కు రెండో శనివారం(11-10-2025) ఓ లేఖ (నెం.డీ1/2495/2025) రాశారు. ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లు అందులో రాయడం వెనుక పెద్ద తతంగమే నడుస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు కలెక్టర్ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి కిందిస్థాయి అధికారులకు సలహాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ‘‘మీరు కొద్ది రోజుల్లో ఎలాగూ బదిలీ అవుతారు. ఈ డీ(ED) నోటిఫై పై పాజిటివ్‌గా కలెక్టర్ నుంచి వచ్చినట్లు రిపోర్ట్ ఇచ్చి వెళితే ఏమవుతుంది’’ అని చెప్పడం కలవర పెడుతున్నది. కింది స్థాయి అధికారులు గత నెలలో డీ నోటిఫై నివేదిక(నెం. బీ/772/2025) ఇచ్చారు. అయితే, ఇది డీటెయిల్డ్‌గా ఉండడం, ఉన్న లోసుగులను సైతం ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం బయటపెట్టింది. కలెక్టర్ రివ్యూ చేసి ఏం జరిగిందో గుర్తించారు. అంతలోనే ఆర్డీవో(RDO) కార్యాలయంలో సీలింగ్ ఫైల్(Ceiling file) (నెం. సీసీ 702/ఎం/75) మిస్ అయింది. కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉండడంతో కావాలనే సీలింగ్ భూములపై కుట్రలు జరగడంపై పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉన్నది.


Also Read: Minister Adluri Lakshman: గుడ్ న్యూస్.. 4092 గురుకుల ఉద్యోగుల సేవలు పునరుద్ధరణ

మా వాదనలు వినండి: చెరుకూరి అరవింద్ బాబు

సీలింగ్ భూములను ప్రభుత్వం, ప్రైవేట్ ల్యాండ్ అని శ్రీరామనాదం వారసులు, సాదా బైనామాతో కొన్నామని మరికొందరు, ఇలా వివిధ కోర్టులో కేసులు పెడింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేకూరేలా భూములను నిషేదిత జాబితా నుంచి తొలగించాలని లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. కేసుల్లో ప్రతివాదులుగా ఉన్నందున తమ వాదన విన్న తర్వాతనే డీ నోటిఫై చేయాలని కలెక్టర్‌కు, ఎమ్మార్వోకు అబ్జెక్షన్ లేఖలు అందాయి. ఇప్పటికే సివిల్ కోర్టులో (ఓఎస్ నెం. 101/2025 (డిక్లరేషన్-కమ్-క్యాన్సిలేషన్ ఆఫ్ ఫేక్ 13బీ అందడ్ 13సీ డాక్యుమెంట్స్) కేసు విచారణ జరుగుతున్నది. ఇంతలోనే డెవలపర్స్ అండ్ బిల్డర్స్ పేరుతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్(Collector), డీఆర్ఓ(DRO), ఆర్‌డీఓ(RDO), ఎంఆర్‌ఓ(MRO)లను తప్పుదారి పట్టించి, నకిలీలతో పత్రాలను తారుమారు చేయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.

సీలింగ్ భూమి అయిన..

22ఏ రికార్డుల నుండి డీ నోటిఫై చేయమన్న దరఖాస్తులో తమ వాదనలు విన్న తర్వాతనే నివేదిక సమర్పించాలని చెరుకూరి అరవింద్ బాబు(Cherukuri Aravind Babu) వేడుకున్నారు. అన్ని రికార్డులు పరిశీలించి నిజమైన పట్టా భూములను మాత్రమే డీ నోటిఫై చేయాలని కోరారు. కోడూరు వెంకట రామయ్య(Venkata Ramaiah)కు చెందిన సీలింగ్ భూమి అయిన సర్వే నెంబర్ 83/ఏ లోని 5 ఎకరాల 25 గుంటలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న వారిపై చర్యలు తీసుకునేలా ఉండాలని ఫిర్యాదులో తెలిపారు. ఇవేమీ పట్టించుకోకుండా ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో రికార్డులు తారుమారు చేసి, తప్పుడు నివేదికలు సమర్పిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా ధనాన్ని పెంపొందించాల్సిన అవసరం బాచుపల్లి రెవెన్యూ అధికారుల పై ఎంతైనా ఉన్నది.

Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ సవాల్.. సుప్రీం విచారణపై ఉత్కంఠ?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..