Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ఓకే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే కాస్త ఆశ్చర్యం కలుగకమానదు. కానీ, ఇది నిజమే. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఆనంద్ దేవరకొండ చేస్తున్న సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ సోమవారం మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. వేరే హీరోల సినిమాలను కూడా సొంతంగా విడుదల చేసే కెపాసిటీ ఉన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, ఓన్ బ్యానర్ సినిమాను ఇలా ఓటీటీలో విడుదల చేయాలనేలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా? అని అంతా తెగ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అనుమానించడానికి ఏముంది? సినిమా పెట్టుబడి కంటే కొంత మేర లాభాలు వచ్చే డీల్ కుదరడంతో నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఓకే చెప్పేసి ఉంటాడు. అంతకు మించి ఏమీ ఉండదు. పైగా, ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రమోషన్స్ చేసి, వేరే సినిమాలతో పోటీకి పోయి, థియేటర్లలో సరిగా ఆడకపోతే వచ్చే మనీ కూడా రాదు కాబట్టే.. ఆ రిస్క్ అంతా ఎందుకుని ఈ డీల్ ముగించేసి ఉండొచ్చు.
Also Read- Siddu Jonnalagadda: నా బాయ్ ఫ్రెండ్ అలా మాట్లాడితే చంపేస్తానంటూ.. రాశీ సెట్ నుంచి వెళ్లిపోయింది
‘తక్షకుడు’గా ఆనంద్ దేవరకొండ
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనే కాదు, ఈ సినిమా టైటిల్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. కరోనా టైమ్‌లో ఆనంద్ దేవరకొండ చేసిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడదే సినిమా దర్శకుడు వినోద్ అనంతోజుతో ఆనంద్ దేవరకొండ చేసిన ఈ చిత్రానికి ‘తక్షకుడు’ (Takshakudu) అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. గన్ పట్టుకుని బ్లాక్ దుస్తుల్లో సీరియస్ లుక్‌లో ఉన్నారు. గన్‌పై మంటలు కనిపిస్తుండగా, ‘వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు’ అనే కొటేషన్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. మొత్తంగా అయితే ఈ ఫస్ట్ లుక్, టైటిల్‌తో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడేలా చేశారు. ఇప్పుడీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా ఓటీటీ వివరాలకు వస్తే..
Also Read- Devara Movie: రిలీజైన ఏడాదికి అమ్ముడైన దేవర శాటిలైట్ రైట్స్.. మరీ ఇంత దారుణమా!
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
ఆనంద్ దేవరకొండ సరసన నితాశీ గోయల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నెట్‌ప్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు రానుంది. కాకపోతే ఎప్పటి నుంచి అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటుందని చిత్ర బృందం, సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ సినిమా కాకుండా ఆనంద్ దేవరకొండ ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా రూపొందుతోన్న సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు సితార వంటి బ్యానర్.. ఇలా డైరెక్ట్‌గా ఓటీటీకి సినిమాను ఇవ్వడంపై ఇండస్ట్రీలో సైతం హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే వాదన బాగా వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నాడా? ఇకపై ఆయన ఇలాగే చేస్తే, థియేటర్ల పరిస్థితి ఏంటి? అనేలా మరో వెర్షన్ టాక్ నడుస్తుంది.
It started with atyasa, and prateekaram will follow. 🔥
Watch #Takshakudu, coming soon, only on Netflix.#TakshakuduOnNetflix #AnandDeverakonda @nitanshi_goel @vinodanantoju @vamsi84 #SaiSoujanya #MidhunMukundan @NavinNooli #MokshadhaBhupatiraju #UditKhurana @balaji_dop137… pic.twitter.com/LpifH7wSmT
— Sithara Entertainments (@SitharaEnts) October 13, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
