Producer Dil Raju
ఎంటర్‌టైన్మెంట్

Dil Raju: మళ్లీ రిస్క్ చేస్తున్న దిల్ రాజు.. ఎందుకింత పంతం?

Dil Raju: టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. గతంలో చేసిన రెండు రీమేక్‌ల వల్ల భారీగా చేతులు కాల్చుకున్నప్పటికీ, ఎలాగైనా హిందీ పరిశ్రమలో ఒక ఘన విజయం సాధించాలని ఆయన పంతం పట్టినట్లు కనిపిస్తోంది.

గతంలో గుణపాఠం నేర్వని రాజు

నిర్మాతగా దిల్ రాజు బాలీవుడ్ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. తెలుగులో విజయవంతమైన సినిమాలను హిందీలో రీమేక్ చేసి, పెద్ద హీరోలతో విడుదల చేసినా ఫలితం నిరాశపరిచింది. నాని నటించిన బ్లాక్‌బస్టర్ ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్‌తో రీమేక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అదేవిధంగా, విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ చిత్రాన్ని రాజ్ కుమార్ రావుతో రీమేక్ చేసినా, అదీ అంచనాలను అందుకోలేకపోయింది. వరుసగా రెండు రీమేక్ డిజాస్టర్‌ల తర్వాత కూడా, ఆయన బాలీవుడ్ ఫైల్‌ను క్లోజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Also Read- Ayesha Zeenath: బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ శివంగి గురించి తెలుసా..

మరోసారి రిస్క్ చేస్తున్న రాజు

తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజు మరో రెండు పెద్ద బాలీవుడ్ ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటిది.. విక్టరీ వెంకటేష్ నటించిన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, గత కొంతకాలంగా అక్షయ్ కుమార్‌కు కూడా సౌత్ రీమేక్‌లు కలిసిరావడం లేదు. ఈ నేపథ్యంలో, దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం మరో రిస్క్ కాబోతుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, దిల్ రాజు.. బాలీవుడ్ ‘కండల వీరుడు’ సల్మాన్ ఖాన్‌తో కూడా ఒక భారీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం. వంశీ పైడిపల్లి ఇప్పటికే సల్మాన్‌కు కథ వినిపించారని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Also Read- Devara Movie: రిలీజైన ఏడాదికి అమ్ముడైన దేవర శాటిలైట్ రైట్స్.. మరీ ఇంత దారుణమా!

ఎందుకింత పంతం?

వరుస పరాజయాల తర్వాత కూడా దిల్ రాజు బాలీవుడ్‌పై పట్టు వదలకపోవడం వెనుక ఆయనలోని ‘హిట్ కొట్టాలన్న’ పంతం స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో నిలకడైన విజయాలు ఉన్నప్పటికీ, బాలీవుడ్ వంటి పెద్ద మార్కెట్‌లో తన సత్తా నిరూపించుకోవాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది. అందుకే, హిందీ రీమేక్‌లు వరుసగా విఫలమవుతున్న ట్రెండ్‌ను పట్టించుకోకుండా, మరోసారి బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జతకడుతున్నారు. దిల్ రాజు చేస్తున్న ఈ భారీ రిస్క్, ఆయనకు బాలీవుడ్‌లో తొలి విజయాన్ని అందిస్తుందో లేదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!