Ayesha Zeenath: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నటి ఆయేషా జీనత్ (Ayesha Zeenath), తన ఫైరీ పర్సనాలిటీ, బలమైన అభిప్రాయాల కారణంగా ఇప్పటికే ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారారు. ఈ కేరళ మూలాలున్న నటి, తెలుగు, తమిళ టెలివిజన్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయేషా కెరీర్ 2017లో తమిళంలో విజయ్ టీవీలో ప్రసారమైన ‘రెడీ స్టడీ పో’ అనే గేమ్ షోతో మొదలైంది. ఆ తర్వాత, 2018లో ‘పొన్మగళ్ వందాల్’ సీరియల్‌లో రోహిణి పాత్రతో నటన ప్రారంభించారు. తమిళంలో ఆమెకు విశేషమైన గుర్తింపు తెచ్చిన సీరియల్ ‘సత్య’. ఈ సీరియల్‌లో ‘రౌడీ బేబీ’ సత్య పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
Also Read- Fauji Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ్యూడ్ హీరో సర్‌ప్రైజ్.. మొత్తానికి లీక్ చేసేశాడు
తెలుగు ప్రేక్షకులకు పరిచయమే..
ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె తెలుగులో స్టార్ మాలో ప్రసారమైన ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ సీరియల్‌లో నందిని పాత్రలో, అలాగే ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల, ఆమె ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ అనే తెలుగు టీవీ షోలో కూడా పాల్గొన్నారు. ఆయేషా టెలివిజన్ సీరియల్స్, షోలతో పాటు సినిమాల్లో కూడా నటించారు. ఆమె ‘ఉప్పు పులి కారం (వెబ్ సిరీస్), తార (వెబ్ సిరీస్), మోయి విరుందు, రాంబో’ వంటి చిత్రాలలో నటించారు. ఆమె హాజరైన మరో రియాలిటీ షో ‘సూపర్ క్వీన్’లో రన్నరప్‌గా నిలిచారు. ఇలా తమిళ, తెలుగు, మలయాళం భాషల్లో ఆమె సుపరిచిత నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read- Meesala Pilla Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్ వాయిదా..
బిగ్ బాస్ తమిల్ సీజన్ 6లో శివంగి
ఆయేషాలోని మరో కోణం బయటపడింది మాత్రం బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లోనే అని చెప్పుకోవాలి. అందులో తన బలమైన అభిప్రాయాలతో పాటు, భయమే లేని స్వభావంతో 2022లో ప్రసారమైన బిగ్ బాస్ తమిళం సీజన్ 6 (Bigg Boss Tamil Season 6) లో శివంగిగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సీజన్‌లో ఆమె దాదాపు 63 రోజుల పాటు హౌస్‌లో ఉండి, అత్యంత వివాదాస్పద కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందారు. హౌస్‌లో తన ఆట తీరుతోనే కాకుండా, హోస్ట్ కమల్ హాసన్‌తో కూడా తనపై వచ్చిన ఆరోపణల విషయంలో వాదనకు దిగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఫైర్ బ్రాండ్ ఇమేజే ఆమెకు తెలుగు బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మార్గం సుగమం చేసిందని చెప్పవచ్చు. తమిళ బిగ్ బాస్‌లో ఆమె చూపించిన దూకుడు, నిర్మొహమాటమైన పద్ధతి తెలుగు బిగ్ బాస్ 9 హౌస్‌లో ఎలాంటి తుఫాన్‌ను సృష్టిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా, ఆటను ఎంతవరకు మార్చగలుగుతుందో తెలియాలంటే మాత్రం బిగ్ బాస్‌ని ఫాలో అవ్వాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
