Fauji Movie Title Leak
ఎంటర్‌టైన్మెంట్

Fauji Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ్యూడ్ హీరో సర్‌ప్రైజ్.. మొత్తానికి లీక్ చేసేశాడు

Fauji Movie: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా టైటిల్ గురించి ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), తన తదుపరి చిత్రం ‘డ్యూడ్’ (Dude) ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ, అనుకోకుండా ఈ భారీ ప్రాజెక్టు టైటిల్‌ను బహిరంగంగా వెల్లడించారు. ఈ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వారు అఫీషియల్‌గా అనౌన్స్ చేయకుండానే, పబ్లిక్ ఫంక్షన్స్‌లో వారి చిత్రాల పేర్లు, క్యాస్ట్ రివీలవుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ‘డ్రాగన్’ పేరు ఎలా అయితే నిర్మాత ఓ వేడుకలో ప్రకటించారో.. అలాగే ఆ సినిమాలో ‘రుక్మిణి వసంత్’ నటిస్తుందని అదే నిర్మాత మరో సినిమా ఈవెంట్‌లో లీక్ చేశారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్.. ప్రభాస్, హనుల సినిమా టైటిల్ లీక్ చేసేశారు.

Also Read- Siddu Jonnalagadda: నా బాయ్ ఫ్రెండ్ అలా మాట్లాడితే చంపేస్తానంటూ.. రాశీ సెట్ నుంచి వెళ్లిపోయింది

ప్రభాస్, హను కాంబో ఫిల్మ్ టైటిల్ లీక్

‘డ్యూడ్’ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. మైత్రీ నిర్మాతలైన నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ యొక్క అంకితభావం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో, ఆయన మాటల్లో ప్రభాస్ సినిమా టైటిల్ బయటపడింది. ‘‘నేను చెప్పవచ్చో లేదో తెలియదు, కానీ మా నిర్మాతలు నాకు ప్రభాస్ సర్ ‘ఫౌజి’ (Fauji) చిత్రం నుండి కొన్ని క్లిప్పింగ్‌లను చూపించారు. వారు ఎంత ప్యాషనేట్ నిర్మాతలు అనేది ఆ క్లిప్పింగ్స్‌ చూస్తే అర్థమైంది. అది అసాధారణం’’ అని ప్రదీప్ అన్నారు. అయితే, టైటిల్‌ను లీక్ చేసిన విషయం గుర్తించిన వెంటనే, ‘నేను తప్పు చెప్పానా? ఇది బహిరంగంగా చెప్పకూడదా? సారీ సర్!’ అని నవ్వుతూ క్షమాపణ చెప్పినప్పటికీ, అప్పటికే ఈ వార్త అభిమానుల మధ్య వైరల్ అయ్యింది. చాలా కాలంగా ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారని ఊహాగానాలు ఉన్నప్పటికీ, అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు.

Also Read- Meesala Pilla Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్ వాయిదా..

ఆర్మీ అధికారి పాత్రలో

సడెన్‌గా ప్రదీప్ రంగనాథన్ చిత్ర నిర్మాతల సమక్షంలో ‘ఫౌజి’ అని మాట్లాడి.. టైటిల్ ఇదేనని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ‘ఫౌజి’ విషయానికి వస్తే.. 1940ల నాటి నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా ఇమాన్వీ కథానాయికగా పరిచయం అవుతోంది. సుమారు 60 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమా, అత్యుత్తమ సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతోందని ప్రదీప్ రంగనాథన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తమ తదుపరి అప్‌డేట్‌లో ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారేమో అని ప్రభాస్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?