Telusu Kada Trailer Launch
ఎంటర్‌టైన్మెంట్

Siddu Jonnalagadda: నా బాయ్ ఫ్రెండ్ అలా మాట్లాడితే చంపేస్తానంటూ.. రాశీ సెట్ నుంచి వెళ్లిపోయింది

Siddu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ కమింగ్-ఆఫ్-ఏజ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలతో సినిమాపై భారీగా అంచాలను పెంచేయగా, అక్టోబర్ 17న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. స్టైలిస్ట్ నీరజా కోన (Neeraja Kona) ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుండగా.. బ్యూటీస్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిరిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు టీమ్ సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో సిద్దు జొన్నలగడ్డ‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ..

Also Read- Meesala Pilla Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్ వాయిదా..

రాశీ ఖ‌న్నా సెట్ నుండి వెళ్లిపోయింది

‘‘ఈ సినిమాలో ఒక్క లిప్‌లాక్ సన్నివేశం కూడా లేదు. ఈ క‌థ ఓకే చెప్పిన‌ప్పుడే కిస్ సన్నివేశాలు లేకుండా సినిమా చేద్దామ‌ని డైరెక్ట‌ర్ నీర‌జతో చెప్పాను. లిప్‌లాక్స్ లేకపోయినా, అంత‌కుమించిన హై ఫీలింగ్‌ అందరికీ ఈ మూవీ ఇస్తుంది. ఫిజిక‌ల్‌గా కంటే ఎమోష‌న‌ల్ ఇందులో ఇంటిమ‌సీ సన్నివేశాలు చూపించాం. ఇందులో నా పాత్ర రాడికల్‌గా ఉంటుంది. ఇందులో నేను ల‌వ్ గురించి మాట్లాడే విధానం, నా క్యారెక్ట‌ర్ ఐడియాల‌జీ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ చేసే సమయంలో ఈ సీన్ నేను చేయ‌న‌ని రాశీ ఖ‌న్నా సెట్ నుండి వెళ్లిపోయింది. ఆమె కారణంగా న‌ల‌భై, నలభై ఐదు నిమిషాల పాటు షూటింగ్ ఆగిపోయింది. అసలు అలా ఎలా మాట్లాడుతాడు నా బాయ్‌ఫ్రెండ్‌? అలా మాట్లాడితే చంపేస్తాను, వ‌దిలేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడందరం నువ్వు రాశీ ఖ‌న్నావి.. అంజ‌లివి కాద‌ని చెప్పి కూల్ చేశాం. అంత‌గా ఆమె తన పాత్రలో లీనమైంది’’ అని సిద్దు చెప్పుకొచ్చారు.

Also Read- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి.. ఒక కామనర్ అయిన శ్రీజకు లక్షల మంది సపోర్ట్.. రీ ఎంట్రీ ఉంటుందా?

యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడతారు

ఇంకా సిద్ధు మాట్లాడుతూ.. ఆడియన్స్ ఎక్జయిట్‌మెంట్, రెస్పాన్స్‌కి థాంక్యూ. అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌తో ప్రేక్షకులందరికీ ఒక బ్యాంగ్ లాంటిది ఇవ్వాలని ముందే డిసైడ్ అయ్యాం. ట్రైలర్‌లో ఏదయితే చూశారో.. అదే సినిమాలో కూడా ఉంటుంది. అదే క్యారెక్టర్, టోన్ కనిపిస్తుంది. టిల్లు వంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. టిల్లు ఇన్నోసెంట్.. బట్ ‘తెలుసు కదా’లో వరుణ్ అలా కాదు. ఇంటెలిజెంట్ క్యారెక్టర్. వరుణ్ క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇది యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!