vishnu ( Image Source: Twitter )
ఎంటర్‌టైన్మెంట్

Actress Vishnupriya: తెలుగు వాళ్ళకి అవకాశాలు వచ్చినా సీరియల్స్ చెయ్యట్లేదు.. నటి సంచలన కామెంట్స్

 Actress Vishnupriya: ఈ మధ్య కాలంలో నటీ నటులు కొంచం ఫేమ్ వచ్చాక సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ డబ్బును సంపాదిస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అయితే, మన తెలుగు ఛానెల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో కన్నడ వాళ్ళే ఉంటున్నారు. మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదని కాదు, ఇచ్చినా కూడా ఉపయోగించుకోవడం లేదని రూమర్స్ వస్తున్నాయి. ఏ తెలుగు సీరియల్ చూసుకున్నా కన్నడ, మలయాళం వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే, దీని పై సీరియల్ నటి విష్ణుప్రియ సంచలన కామెంట్స్ చేసింది.

Also Read: Bigg Boss 9 Telugu: కామనర్స్ కి నువ్విచ్చే మర్యాద ఇదేనా.. స్క్రిప్ట్ డ్ షో చేస్తూ దానికి రియాలిటీ షో అని పేరు పెట్టడం దేనికి? నెటిజన్స్ కామెంట్స్ వైరల్

తెలుగు నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ముద్దుగుమ్మ సినిమాలతో తన కెరీర్‌ను మొదలు పెట్టి, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె టీవీ సీరియల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎవరైనా సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళ్తారు. ఈ బ్యూటీ మాత్రం రివర్స్ లో సినిమాల నుంచి సిరియల్స్ లోకి వచ్చింది.

Also Read: Minister Vivek: నాకు మంత్రి పదవి పై మోజు లేదు.. మంత్రి వివేక్ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటి?

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోలతో ఫుల్ బిజీగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. “సీరియల్స్‌లో ఎందుకు మన తెలుగు వాళ్ళ కంటే కన్నడ వాళ్లే కనిపిస్తున్నారు? తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదా?” అని అడిగితే దానికి ఆమె విష్ణుప్రియ ఏం సమాధానం చెప్పిందంటే?

Also Read: Viral Parenting Video: అమ్మాయిలాగా రెడీ అయ్యి.. తన పిల్లలకు ఎలా ఉండాలో నేర్పిస్తున్న కన్న తండ్రి.. వీడియో వైరల్

” అయ్యో మీరందరూ అలా అనుకుంటున్నారా? అసలు అక్కడ అది మేటర్ కాదు? తెలుగు అమ్మాయిలు సీరియల్స్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వాళ్ళు సిరియల్స్ కంటే మూవీస్ , వెబ్ సిరీస్‌లలోనే నటించడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అవి కూడా రాకపోతే, సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ.. వచ్చిన వాటితో తృప్తి పడుతున్నారు. ఇక, కొందరు సోషల్ మీడియాలో చూసి సీరియల్ లో అవకాశాలు ఇస్తే కూడా వద్దు అని రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకొందర్న ఇంట్లో వాళ్లు ఆపుతున్నారు. ” అంటూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?