Jubilee Hills By Election: హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేగా ప్రాథమితం వహిస్తున్న మాగంటి గోపీనాథ్(Maganti Gopinadh) ఆకస్మిక మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేయగా, నేడు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి(Collector Hari Chandana Dasari) వెల్లడించారు.
నవంబర్ 14న ఫలితాలు..
ఉప ఎన్నిక సందర్భంగా నేడు 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, నవంబర్ 11న పోలింగ్, అలాగే నవంబర్ 14న ఫలితాలు ఉన్నందున ఫలితాల తదుపరి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 వ తేదీ వరకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లను స్వీకరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి(GHMC) కమిషనర్ ఆర్ వి కర్ణన్(RV Karnana) వెల్లడించారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 21 వరకు (ప్రభుత్వ సెలవు దినాలు మినహా) నామినేషన్ లు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. షేక్ పేట మండల ఆఫీసులో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, అక్కడే నామినేషన్ సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
Also Read; Singareni News: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కి అరుదైన బహుమతి!.. ఎందుకో తెలుసా..!
పర్యవేక్షకుడిగా సంజీవ్‌కుమార్‌లాల్..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఐఆర్‌ఎస్(IRS) అధికారి సంజీవ్ కుమార్ లాల్(Sanjeev Kumar Lal) ను ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా నియమించింది. ఈయన 2014 ఐఆర్ఎస్ బ్యాచ్ కి చెందిన అధికారిగా వెల్లడించారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షకులు ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణలో భాగంగా అన్ని కార్యకలాపాలను సమీక్షించడంతో పాటు, ఎన్నికల వ్యయంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణను కొనసాగించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
