Oka Manchi Prema Katha: ‘ఒక మంచి ప్రేమ కథ’ రాబోతోంది. సినిమా పేరే ‘ఒక మంచి ప్రేమ కథ’ (Oka Manchi Prema Katha). రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని అక్కినేని కుటుంబరావు (Akkineni Kutumba Rao) దర్శకత్వంలో హిమాంశు పోపూరి (Himanshu Popuri) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు ఓల్గా అందించారు. లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ప్రతి షాట్ ప్రస్తుత సమాజంలోని మానవుల జీవన విధానానికి అద్ధం పడుతోంది. ‘వాళ్ల చేతుల్లో నుంచే మనం మొదటిసారి ప్రపంచాన్ని చూశాం. మన చేతుల్లో నుంచి వాళ్లు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలనుకుంటారు’ అనే డైలాగ్‌తో ఈ సినిమా ఎటువంటి మెసేజ్‌ని ఇవ్వబోతుందో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం వేచి చూసేలా చేస్తుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటి రోహిణి ముల్లేటి (Rohini Molleti) మాట్లాడుతూ.. ‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఎప్పుడూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ‘ఒక మంచి ప్రేమ కథ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. కుటుంబరావు ‘తోడు’ సినిమా నాకు ఎంతో ఇష్టం. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన ఇలా సినిమా తీయడం సంతోషంగా ఉంది. ఓల్గా రాసిన కథ నాకు చాలా నచ్చింది. నేను, రోహిణి చాలా ఏళ్ల క్రితం కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఇలా కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రను చూస్తే అందరికీ కోపం వస్తుంది. అలా ఉంటుంది. నేను కూడా ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నాను. మా సినిమాను ముందుకు తీసుకెళ్తున్న ఈటీవీ విన్ టీమ్‌కు థాంక్స్ అని అన్నారు.
Also Read- Bigg Boss Telugu 9: డబుల్.. షాకింగ్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చేసిన నాగ్!
మనసును హత్తుకున్న సినిమా ఇది
సీనియర్ నటి రోహిణి హట్టంగడి (Rohini Hattangadi) మాట్లాడుతూ.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబరావు, ఓల్గా ఓ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. అప్పుడు వాళ్లతో చేయలేకపోయాను. కానీ, ఈ కథను విన్న వెంటనే ఓకే చెప్పాను. రోహిణి కూడా ఇందులో నటిస్తుందని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మేమిద్దరం మలయాళంలో ఓ సినిమాకు కలిసి పని చేశాం. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. ఇంకా చెప్పాలంటే నా మనసును హత్తుకున్న సినిమా ఇది. ఇంత మంచి చిత్రంలో నన్ను పార్ట్ చేసిన కుటుంబరావు, ఓల్గాలకు థాంక్స్. ఈటీవీ విన్ రూపంలో ‘ఒక మంచి ప్రేమ కథ’ లాంటి మంచి చిత్రానికి మంచి ఓటీటీ ఫ్లాట్ ఫాం లభించిందని తెలిపారు. నిర్మాత హిమాంశు పోపూరి మాట్లాడుతూ.. టైటిల్‌కు తగినట్లే నిజంగానే ఇదొక మంచి ప్రేమ కథ. ఈ స్టోరీ విన్న వెంటనే బాగా కనెక్టైంది. ఇందులో ఓ పాత్రని కూడా నేను పోషించాను. నాకు కనెక్ట్ అయినట్లుగానే, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
Also Read- Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఆ ఇద్దరు పండిట్స్! థమన్ స్కెచ్ అదిరింది
నవ్విస్తూ, ఏడ్పించేలా
రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ.. నేను ఈ కథను ముందుగా చిన్నగా రాశాను. సినిమాగా తీస్తే బాగుంటుందని చాలా మంది సలహాలు ఇవ్వడంతో పాటు, హిమాంశు వచ్చి ఈ కథను సినిమాగా తీయాలని పట్టుబట్టారు. రోహిణి ముల్లేటి ముందు నుంచీ ఈ కథతో ప్రయాణం చేశారు. మా ప్రాజెక్ట్‌లోకి రోహిణి హట్టంగడి రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. సముద్రఖని ఎంత బిజీగా ఉన్నా కూడా డేట్లు ఇచ్చి, సపోర్ట్ చేశారు. ఈటీవీ విన్ మా సినిమాను తీసుకోవడం చాలా హ్యాపీ. ఎందుకంటే, 1985 నుంచి 2017 వరకు నేను రాసిన ప్రతీ నవల చతురలో వచ్చింది. అలాగే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌లో నేను చాలా కాలం పని చేశాను. మళ్లీ ఇప్పుడు నా సినిమా ఈటీవీ విన్‌లో వస్తుందని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది. అంతా పెద్దవాళ్లే కనిపించినా, ఇది నేటి యువతరానికి సంబంధించిన కథ అని అన్నారు. ‘‘ఓల్గా మంచి కథను, మాటలను, పాటలను ఇచ్చారు. నేటి తరం కోట్లు సంపాదించేందుకు పరుగులు పెడుతున్నారు.. కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. అందరిలోనూ ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాం. ఎక్కడా బోర్ కొట్టించకుండా నవ్విస్తూ, ఏడ్పించేలా ఈ మూవీని రూపొందించాను. ఈటీవీ విన్‌లో మా సినిమా వస్తుండటం ఆనందంగా ఉంది. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు దర్శకుడు అక్కినేని కుటుంబరావు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
