sand ( Image Source: Twitter)
తెలంగాణ

Telangana: దారుణం.. పెరిగిపోతున్న ఇసుక లారీల దందా.. అంబులెన్స్ కు కూడా దారి లేదు?

Telangana: రాష్ట్ర ప్రజల అత్యవసర ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న ఆంబులెన్స్ లకు కూడా చర్ల మండలంలో రహదారి లో దారి కనిపించడం లేదు. నిత్యం ఇసుక లారీలతో రహదారి అంత నిండిపోయి వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు దాపరించాయి. నిజంగా ఇసుక వ్యాపారం చేసే వారు ఇసుకను సరఫరా చేసే లారీలు రాత్రి 7 గంటల తర్వాత రహదారులపై నడిపించాల్సి ఉంటుంది. కానీ, భద్రాచలం నియోజకవర్గం లోని చర్ల మండలం సహా పలు సమీప మండలాల్లో కూడా ఇసుక లారీలతో రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. పట్టపగలే నడి రహదారుల పై నుండి ఇసుక లారీలు రవాణా చేస్తుండడంతో సాధారణ ప్రజలు మొదలుకొని వాహనదారులకు రహదారిపై ఎదురుగా వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతుంది. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం లోని చర్ల మండలంలో అయితే మరి మితిమీరిన లారీల రవాణాతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అన్నీ తెలిసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత నాయకులు ఇసుక లారీల రవాణా వ్యవస్థపై ప్రశ్నించకపోవడం హాస్యాస్పదమని వివిధ వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎటపాక నుండి మర్రాయి గూడెం మధ్యలో రహదారిపై ఇసుక లారీలు

చర్ల భద్రాచలం మధ్యలో ఎటపాక నుండి మర్రాయి గూడెం మధ్యలో రహదారిపై ఇసుక లారీలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో అత్యవసర సేవల కోసం వినియోగించే అంబులెన్స్ లకు కూడా దారి లేకపోవడంతో రోగులు ఏ క్షణాన మరణిస్తారో కూడా తెలియని దుస్థితి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలు నిబంధనలకు విరుద్ధంగా రహదారిపై రవాణా చేస్తూ ఇతర వాహనాలకు, ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకాలను కలిగిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా వ్యాపారులు తమదైన శైలిలో నిబంధనలకు విరుద్ధంగా జెసిబి ల ద్వారా లారీలలో ఇసుకను నింపి అడ్డగోలుగా రహదారిపై రవాణా చేసేందుకు తమ ఇస్టారీతన ప్రవర్తిస్తున్నారు. అడిగే వారు లేరు కదా అని అడ్డగోలుగా రహదారులపై ఇసుక లారీలతో పెద్ద హంగామానే సృష్టిస్తున్నారు.

రహదారులపై ఇసుక రవాణా చేస్తున్న లారీలపై ప్రత్యేక వాట్సాప్ గ్రూప్

చర్ల మండలంలో నిత్యం ఇసుక లారీలతో రహదారులు నిండిపోయి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు రహదారుల పరిస్థితి పై వివరించినప్పటికీ స్పందించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని చర్ల మండలంలోని 26 గ్రామపంచాయతీ ప్రజలు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి రహదారి దుస్థితిపై చర్చ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి చర్ల మండలంలోని బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీలకు అతీతంగా వచ్చి రాస్తారోకో ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సంసిద్ధులవుతున్నారు. ఇసుక రవాణా చేసే లారీలతో రహదారులపై ఏర్పడుతున్న తీవ్ర ఆటంకాల నేపథ్యంలో ప్రత్యేకించి రాస్తారోకో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారంటే చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఇసుక లారీల తో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇసుక లారీల దందాలపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లారీల రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలని రెండు మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!