mega-star-sajjanar( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi meets Sajjanar: పీసీ సజ్జనార్‌ను కలిసిన మెగాస్టార్.. ఎందుకంటే?

Chiranjeevi meets Sajjanar: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ సిటీ పోలీస్ బాస్ ను కలిశారు. ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్, ఐపీఎస్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ కలయిక, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఆ ఇద్దరి మధ్య గౌరవపూర్వక సంబంధాన్ని చూపిస్తోంది. సెప్టెంబర్ 30న సజ్జనర్ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు. మునుపటి కమిషనర్ సీవీ ఆనంద్‌కు బదులుగా వచ్చిన ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. జాయిన్ అయిన మొదటి రోజే ‘ఎక్స్‌ట్రా మైల్’ పథకాన్ని లాంచ్ చేసి, పోలీసులను ప్రోత్సహించారు. అలాంటి ఎక్సైటింగ్ ఫేజ్‌లో చిరంజీవి సజ్జనార్ ను కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. వీరి కలయిక మర్యాద పూర్వకంగానే జరిగినా మెగాస్టారే స్వయంగా వచ్చి పీసీ సజ్జరాన్ ను కలవడం మరింత ప్రత్యేకమైనది. ఇది మెగాస్టార్ చిరంజీవి మర్యాదకు అద్దం పడుతోంది. దీంతో చిరంజీవీ ఎంత స్టార్ అయినా ఒదిగే ఉంటాను అని చెప్పకనే చెబుతున్నారు.

Read also-K Ramp controversy: హీరోలను రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు కరెక్టేనా?.. లేదా ప్రమోషన్‌లో భాగమా!..

ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి సజ్జనర్‌ ను కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి మధ్య చిన్న పాటి చర్చలు జరిగాయి. ఈ ఈవెంట్‌లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ట్రెడిషనల్లో, సజ్జనర్ యూనిఫామ్ లో మర్యాదగా పోజ్ ఇచ్చారు. సినిమాల్లోనే కాకుండా, సోషల్ వర్క్‌లో టాప్ ఫార్మ్‌లో ఉండే చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఎన్విరాన్మెంట్ కార్స్, స్పెషల్ జస్టిస్ ఇనిషియేటివ్స్ వంటివి వాళ్లకు తెలిసినవే. ఇప్పుడు పోలీస్ టాప్ ఆఫీసర్‌ను కలవడం ద్వారా, మళ్లీ తన సిటిజన్ రెస్పాన్సిబిలిటీని ఉదాహరణగా చూపారు. సజ్జనర్ , తెలంగాణ స్పెషల్ పోలీస్ బాస్‌గా గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్నవారు. వాళ్ల లీడర్‌షిప్‌లో హైదరాబాద్ పోలీసింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని ప్రజలు అంచనా వేస్తున్నారు. దీనిని చూసిన సజ్జనార్, చిరంజీవి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Sai Dharam Tej: అప్పుడు కోమాలోకి వెళ్లాను అని చెప్పలేదు.. చిల్ అవ్వడానికి వెళ్లా అని చెప్పేవాడిని..

సజ్జనర్ 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, TS స్పెషల్ పోలీస్ చీఫ్‌గా ఆయనకు ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ‘పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్’తో హైదరాబాద్‌ను సేఫ్, స్మార్ట్ సిటీగా మార్చాలని చూస్తున్నారు. మునుపటి కమిషనర్ సీవీ ఆనంద్‌కు బదులుగా వచ్చిన ఆయన, ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ తన మొదటి వీడియో కాన్ఫరెన్స్‌లోనే ‘ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్’ పథకాన్ని లాంచ్ చేశారు. ఇది పోలీసుల మోటివేషన్‌కు గేమ్ ఛేంజర్ డ్యూటీకి మించి మానవతావాద దృక్పథంతో అదనపు ప్రయత్నాలు చేసిన అధికారులను గుర్తించడానికి డిజైన్ చేసిన ఇన్నోవేటివ్ స్కీమ్ ఇది. ప్రతి శనివారం ఒక మంచి పోలీసు ఆఫీసర్ లేదా స్టాఫ్‌ను సర్టిఫికెట్‌తో పాటు రివార్డ్‌తో సత్కరిస్తారు. దీనిపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!