VD new movie: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాతో సిద్ధం అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ‘కింగ్డమ్’ తర్వాత విజయ్ ఏ సినిమాను ఒప్పుకోలేదు. కింగ్డమ్ పార్ల్ 2 ఉంటుంది అని సినిమాలో హింట్ ఇచ్చినా దాని కనుగుణంగా హీరో ఎక్కడా అడుగులు వెయ్యలేదు. నేరుగా ఈ సినిమానే ప్రారంభించారు.
Read also-Tollywood: నిర్మాతలుగా మారుతున్న స్టార్ హీరోలు.. మరి నిర్మాతల పరిస్థితి!
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేశ్ కథా నాయికగా నటిస్తోంది. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దిల్ రాజు ప్రొడక్షన్ విజయ్ దేవరకొండకు కలిసి వస్తుందో లేదో చూడాలి మరి.
Read also-Dark Chocolate teaser: ‘డార్క్ చాక్లెట్’ టీజర్ ఇదే.. ఏంటి గురూ మరీ ఇలా ఉంది..
ఇటీవలే రష్మిక మందానతో ఎంగేజ్మెంట్ చేసుకుని అదే ఉత్సాహంతో సినిమా ప్రారంభించాడు విజయ్ దేవరకొండ. ఇది ఎంత వరకూ కలిసి వస్తుందో చూడాలి మరి. పెళ్లికి ముందు మంచి హిట్ పడితే విజయ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ఎన్నో అంచనాలతో ప్రారంభించిన ఈ సినిమా విజయ్ మంచి హిట్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
A Wild Beginning.. 🔥
LOVE – RAGE – BLOOD ❤️🔥The most anticipated @TheDeverakonda x @storytellerkola's #SVC59 has began today with an auspicious Pooja Ceremony.#VDKolaMassThaandavam Begins.. 💥@KeerthyOfficial #AnendCChandran@DinoShankar @PraveenRaja_Off @SVC_official pic.twitter.com/LkTb6lsliK
— Sri Venkateswara Creations (@SVC_official) October 11, 2025
