Telangana Text books Errors
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad:’ముందు మాట’ వెనుక ‘ఎరాట’

  • బీఆర్ఎస్ హయాం నుంచీ కొనసాగుతున్న ‘ముద్రణ’ తప్పులు
  • ముందుమాటలో పాత పాలన యంత్రాంగాన్నే ప్రచురించిన అధికారులు
  • విద్యార్థులను తప్పుతోవ పట్టిస్తున్న నిర్లక్ష్య ధోరణి
  • ప్రతి ఏటా ఎరాట పేరిట లక్షల్లో ఖర్చుపెట్టి తప్పొప్పుల సవరణ
  • అనుభవజ్ణులతో తప్పులను సరిచేయించే బాధ్యత వహిస్తున్న ఎస్ సీఈఆర్ టీ
  • ప్రతి సబ్జెక్ట్ కూ 10 నుంచి 15 మందితో పరిశీలన
  • డిసెంబర్, జనవరి లోగానే పూర్తి చేసే టార్గెట్
  • పాతవారితోనే కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్న తంతు
  • కొందరు నిర్లక్ష్య ధోరణి అధికారులతో బద్నాం అవుతున్న కాంగ్రెస్ సర్కార్

Telangana text books printing mistakes corrections with Errata:


తెలుగు పాఠ్యపుస్తకాలలో తప్పిదాలు ..గత పదేళ్లుగా మారని ధోరణి..విద్యాశాక అధికారుల నిర్లక్ష్యం ఏవీ మారలేదు. అ ప్రభావం అంతా కొత్తగా ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై పడింది. ఈ విద్యాసంవత్సరం ముందుగానే పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయాలనే అత్యుత్సాహమో లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ విద్యార్థులకు అందజేసిన తెలుగు టెక్ట్స్ బుక్స్ కు ముందు మాటలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు పేర్లు ఏవీ మారలేదు. పాత కాపీలనే 24 లక్షల పుస్తకాలను ముందుగా పంచేశారు. మళ్లీ ఆదరాబాదరాగా వెనక్కి రప్పించి ముందు మాట ను మార్చే కసరత్తు ప్రారంభించారు.

పదేళ్లుగా అదే తీరు


పదేళ్లుగా అవే పుస్తకాలు అనుభవజ్ణులను కూర్చోబెట్టి నిర్వహిస్తూ వస్తున్నారు అధికారులు . ఈ తప్పుల తడకలను సరిదిద్దే బాధ్యతను ప్రతి ఏటా ఎరాటా (తప్పొప్పుల దిద్దుబాటు కార్యక్రమం) పేరిట నిర్వహిస్తుంటారు. అయినా తప్పులు మాత్రం అలాగే ఉంటున్నాయి. పాఠ్యపుస్తకాలలో తప్పులు సరిదిద్దేందుకు ఎస్ సీఈఆర్ టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎరాటా కొనసాగిస్తున్న తీరుపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ తప్పులు సరిద్దిద్దేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రహసనంగా మారుతోంది. ప్రతి సంవత్సరం లక్షలు ఖర్చుచేస్తున్నా లోపాలు మాత్రం గుర్తించడం లేదని పాఠ్యపుస్తకాలలో ఉన్న తప్పులు సరిచేయడంలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని విద్యావేత్తలు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.

ఎరాట (తప్పొప్పుల దిద్దుబాటు)

ప్రతి అకడమిక్ ఇయర్ కు సంబంధించిన డిసెంబర్, జనవరి నెలలో ఎస్ సీఈఆర్ టీ ‘ఎరాట’ (తప్పొప్పుల దిద్దుబాటు) కార్యక్రమాన్ని చేపడుతుంటుంది. ఒక్కో సబ్జెక్టుకు మూడు నుంంచి 5 రోజులపాటు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఒక్కో సబ్జెక్టుకు 10 నుంచి 15 మంది సబ్జెక్టు ఎక్స పర్ట్స్ తో ప్రస్తుతమున్న పుస్తకాలలో తప్పులను సరిచేయిస్తంటారు. ఇదంతా ఏదో తూతూ మంత్రంగానే జరుగుతోందని చెబుతున్నారు.ఐదేండ్ల నుంచి పాతవారినే ఈ వర్క్‌‌షాప్‌‌కు పిలుస్తుండటంతో వారు పెద్దగా తప్పులను గుర్తించడం లేదని అంటున్నారు. ఏటా కొత్తవారిని పిలిస్తే, వారు ఇంకొన్ని తప్పులు గుర్తించే అవకాశముందని విద్యావేత్తలు చెప్తున్నారు. పుస్తకాల్లో వచ్చే తప్పులను ప్రొఫెసర్లు, టీచర్లు, ఇతర వ్యక్తులు గుర్తించి ఎస్‌‌సీఈఆర్టీ మెయిల్‌‌కు గానీ, ఆఫీస్‌‌కు గానీ పంపిస్తుంటారు. వీటిలో ఏమైనా మార్పులకు అవకాశముంటే, వాటిని మార్చేసి ‘ఎరాట’ను నామమాత్రంగా ముగించేస్తున్నారనే విమర్శలున్నాయి.

దిద్దుబాటు చర్యలు

తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్‌లో వచ్చిన తప్పులను సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.

ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న అధికారులు

అయితే కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ తన తప్పులు లేకుండానే కొంతమంది అధికారుల నిర్లక్ష్య ధోరణి వలన సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ వ్యవహారంలోనూ ప్రభుత్వానికి తెలియకుండానే విద్యార్తులను హాస్టల్స్ నుంచి ఖాళీ చేయించే నోటీసు ఇవ్వడంతో పెద్ ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు కూడా రేవంత్ సర్కార్ ని ఇరుకునపెట్టాలని చూశాయి. అయితే అక్కడ సకాలంలో స్పందించిన రాష్ట్రప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇలా చాలా శాఖలలో ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలకు అవకాశం ఇచ్చేలా పనిచేస్తున్నారు కొందరు ఉద్యోగులు. ఇలాంటి వారిపట్ల రేవంత్ సర్కార్ అప్రమత్తంగా ఉండాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు