Telangana Workers (image credit: swetcha reporter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana Workers: ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న.. తెలంగాణ వలస కార్మికులు.. ఎడారిలో ఏ దారి లేక అవస్థలు!

Telangana Workers: ఏజెంట్లను నమ్ముకొని జోర్ధాన్ దేశానికి వలస పోయిన 12 మంది తెలంగాణ వాసుల కార్మికుల (Telangana Workers) పరిస్థితి దయనియంగా మారింది. తీసుకెళ్లేటప్పుడు సంవత్సరం లోపు ఎప్పుడైనా తిరిగి రావచ్చని చెప్పిన ఏజెంట్లు, తాజాగా మిమ్మల్ని అమ్మేశాం దిక్కునచోట చెప్పుకోండి అంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామంతా జోర్ధాన్ లో చిక్కుకున్నామని ఏడాదంతా ఆలుగడ్డ కూరతోనే తింటున్నామని వాపోయారు. అక్కడి పరిస్థితుల్ని వివరిస్తూ ఓ వీడియోను బాధితులు విడుదల చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బాధితులు తోట పని కోసం అని మమ్మల్ని గత ఏడాది సెప్టెంబర్ 25న జోర్ధాన్ తీసుకువచ్చారని తిరిగి భారత్కు వెళ్లాలంటే రెండు నెలల ముందు చెప్పాలని తమ ఏజెంట్లు వారికి చెప్పినట్ల తెలుస్తుంది. నచ్చకపోతే సంవత్సరం లోపు ఎప్పుడైనా వెళ్లవచ్చు అన్నారని ఆరు నెలల కంటే ముందు వెళితే మా సొంత ఖర్చుతో టికెట్లు తీసుకోవాలన్నారు.

 Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు

ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇక్కడికి వచ్చాం

వాటన్నింటికీ అంగీకరించి ఇక్కడికి వచ్చామని తీరా ఇప్పుడు రెండు నెలలు ముందు నుంచి చెబుతున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులతో బెదిరింపులకు గురిచేసి బంధించారని ఇండియన్ ఎంబీసీకి ఫిర్యాదు చేశారు బాధితులు దాంతో ఏజెంట్లతో మాట్లాడితే మమ్మల్ని అమ్మేసామని చెప్తున్నారు అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉన్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఇక్కడ బాంబులు పేలుతుండడంతో ఇక్కడ బాంబులు పేలుతుండడంతో భయం భయంగా బతుకుతున్నామంటూ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇక్కడికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ కుటుంబాల వద్దకు చేరేలా సహాయం చేయాలి

ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు వీడియోలో వేడుకున్నారు. జోర్ధాన్ వలస వెళ్లిన వారిలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన వంగ భాస్కర్, చింతమాన్ పల్లికి చెందిన మాచర్ల స్వామి, మాచారెడ్డి మండలం లచ్చపేటకు చెందిన రాజ్ కుమార్, గణేష్ పరమండ్ల నిజామాబాద్ జిల్లా ఎర్గట్లనుంచి గంగాధర్, పెద్ద వాల్కోట్ నుంచి పి. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా కుచాన్ పల్లి నుంచి మోట్టు ముత్తన్న, కుంటాల నుంచి సయ్యద్ ముఖిమ్, జగిత్యాల జిల్లా నుంచి ఏ. నర్సింలు. గుమ్యాల మనోహర్, సిద్దిపేట జిల్లా నుంచి పెండ్యాల మహేందర్, దుబ్బాక బొమ్మమైన పోచయ్య, మొత్తం 12 మంది బాధితులు వీడియో లోకి తెలిపారు. తమను ఎలాగైనా తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ ఎంబీసీతో మాట్లాడి ఇండియాకు తమ కుటుంబాల వద్దకు చేరేలా సహాయం చేయాలని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

 Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!