Bigg Boss Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ లో శనివారం వచ్చే ఎపిసోడ్.. మెుత్తం వారానికే హైలెట్ గా నిలుస్తుంటుంది. ఇంటి సభ్యులు ఆ వారంలో చేసిన తప్పులను.. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున నిలదిస్తుంటారు. కాబట్టి బిగ్ బాస్ వీక్షకులు.. శనివారం ఎప్పుడు వస్తుందా? అని తెగ ఎదురుచూస్తుంటారు. ఇదిలా ఉంటే ఇవాళ శనివారం (అక్టోబర్ 11) కావడంతో నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ఫస్ట్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలాగే నాగ్ మామ వైల్డ్ ఫైర్ గా కనిపించారు. ఇంటి సభ్యులు చేసిన తప్పులను సూటిగా ప్రశ్నిస్తూ.. వారి మిస్టేక్స్ ను సరిచేసే ప్రయత్నం చేశారు.
ప్రోమోలో ఏముందంటే?
శనివారం మెుదటి ప్రోమోలో హోస్ట్ నాగార్జున.. మాస్ సినిమా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. నాగ్ మామ లుక్ కు ఇంటి సభ్యులతో పాటు అక్కడ కూర్చున్న ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఇక ప్రోమో స్టార్టింగ్ లో ఇంటి సభ్యురాలు తనూజకు హోస్ట్ నాగార్జున సూటి ప్రశ్న వేస్తారు. ‘బెడ్ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు కరెక్టా?’ అని ప్రశ్నిస్తారు. ‘ఆ టాస్క్ లో ఆడవారందరిని బెడ్ నుంచి కిందకి తోసేయాలని మగవారు ప్లాన్ చేశారు. గేమ్ నుంచి ఫస్టే ఔట్ అయిన సంజనా.. ఆడవారంతా కలిసి ఆడమని సూచించారు. అప్పుడైనా నీకు సెన్స్ రావాలి కదా. భరణి, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ నిన్ను తీయరని అనుకున్నావా?’ అని తనూజాను నిలదీశారు.
‘పక్కకు లాగడం ఫెయిరా?’
‘బెడ్ టాస్క్ లో తనూజ విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించిన భరణి.. మరో సభ్యురాలు శ్రీజ విషయానికి వచ్చేసారికి అలా పక్కకు లాగేయడం ఫేయిరా’ అని నాగార్జున మరో కంటెస్టెంట్ దివ్యను ప్రశ్నిస్తారు. ‘ఎవరి బాండ్ ను బట్టి వారు అలానే చేస్తుంటారు కదా సార్’ అని దివ్య సమాధానం ఇస్తుంది. ‘అంటే ఆయనకు (భరణి) తనూజ ఉంటే ఓకేనా’ అని నాగార్జున అంటారు. అందుకు అవును అన్నట్లుగా దివ్య సమాధానం ఇస్తుంది. ఒకవేళ దివ్య, తనూజ ఉంటే భరణి ఏం చేసేవారు అని నాగ్ ప్రశ్నించగా.. తనూజకే ఆయన సపోర్ట్ చేసుండేవారని దివ్య సమాధానం ఇస్తుంది.
భరణిపై ఆగ్రహం
బెడ్ టాస్క్ లో సంచాలకురాలిగా వ్యవహరించిన ఫ్లోరాకు హోస్ట్ నాగార్జున ఓ వీడియోను చూపించడం ప్రోమోలో చూడవచ్చు. అందులో డెమోన్ పవన్ కంటే ముందు భరణి నేలపైన పడిపోవడం కనిపించింది. దీనిపై నాగార్జున మాట్లాడుతూ ‘రీతూకి సపోర్ట్ చేసి పవన్ అందరినీ తోసేస్తాడని.. స్ట్రాటజీగా పవన్ ను తీసేశారు’ అని నాగార్జున అంటారు. అప్పుడు భరణి పైకి లేచి ఈ విషయంలో తాను స్వార్థంగానే వ్యహించానని.. దీనిని అంగీకరిస్తున్నానని చెప్పారు. ‘ఇది నాతప్పే’ అంటూ హోస్ట్ తో అంటారు. ‘ఎంతో ఎదగాల్సిన నువ్వు బెడ్ మీదనే కాదు. మా దృష్టిలో కూడా కింద పడ్డావు’ అని భరణీని ఉద్దేశించి నాగార్జున అంటారు. వారంలో తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదని భరణికి ఘాటుగా చెప్పడం ప్రోమోలో చూడవచ్చు.
Also Read: Heli Tourism: రాష్ట్రంలో హెలీటూరిజం.. హైదరాబాద్ టు సోమశీల టు శ్రీశైలం.. సంక్రాంతి నుంచే స్టార్ట్!
‘మీ గేమ్ కనపడట్లేదు’
తాను ఎలాంటి తప్పు చేశాడో భరణికి తెలియజెప్పేందుకు ఆడియన్స్ లోని ఒక యువతి అభిప్రాయాన్ని నాగార్జున కోరతారు. అప్పుడు ఆ యువతి స్పందిస్తూ ‘నాకు మీ (భరణి) గేమ్ కనపడట్లేదు. బాండింగ్సే కనబడుతున్నాయి. మాకు మిమ్మల్ని బిగ్ బాస్ లో ఉంచాలనే అనిపించడం లేదు’ అంటూ సూటిగా తన అభిప్రాయాన్ని చెబుతుంది. దీంతో భరణి ఒక్కసారిగా షాక్ కావడంతో ప్రోమో ముగుస్తుంది.
