Kantara 1 collection: దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం రూ.509 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సంబంధించి ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా సినిమా సాధించిన వసూళ్లను తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా రూ.509 కోట్లు సాధించినట్లుగా ఉంది. ఇప్పటి వరకూ అనేక రికార్డులు తిరగరాసిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. త్వరలోనే మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. 2025లో విడుదలైన ‘ఛావా’ రూ.600 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల వరుసలో టాప్‌లో ఉంది. దీంతో ఈ రికార్డును మరికొన్ని రోజుల్లోనే బీట్ చేసి నెంబర్ ఒన్ నిలిచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read also-Tollywood Heroes: టాలీవుడ్ హీరోల మల్టీప్లెక్స్ బిజినెస్ వెనుక ఇంత కథ ఉందా?
సినిమా ‘కాదుబెట్టు కార్తీకేశ్వర’ ఆరంభాలు, ‘పంజూర్లి దైవ’ (Panjurli Daiva) అనే దైవిక ఆయుధం మూలాలను తెలిపేలా రూపొందించబడింది. 300 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనల చుట్టూ తిరిగే ఈ కథలో, అడవుల మధ్య రాజులు, దేవతలు, మానవుల మధ్య ఘర్షణలు, దైవిక శక్తులు ప్రధానంగా ఉన్నాయి. మునిగి పుచ్చిన అడవి రహస్యాలు, సాంప్రదాయక యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా మిశ్రమంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పడు కలెక్షన్లలో దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్లు రూపాయలు వసూలు చేస్తుందని కాంతార అభిమానులు నమ్ముతున్నారు. అదే అయితే కన్నడ నుంచి వెయ్యి కోట్లు సాధించిన రెండో సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమా కన్నడ కాకుండా రెండో అత్యధిక వసూళ్లు వచ్చిన భాష గా తెగులు నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా స్థరమైన కలెక్షన్లతో దూసుకుపోతుంది.
Read also-HBD Rajamouli: జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. ఎవరెవరు ఏం అన్నారంటే..
ఈ చిత్రంలో రిషబ్ షెట్టి, రుక్మిణి వాసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ నటించారు. ఒరిజినల్ కథకు వెయ్యి సంవత్సరాల ముందు సెట్ చేయబడినది. ఇది కాంతార ప్రజల స్వయం పాలన కోసం పోరాడుతున్న ట్రైబల్ మనిషి బెర్మే (రిషబ్) కథ. ప్రిన్స్ కులశేకర (గుల్షన్) భూమి దాని ప్రజలను నియంత్రించాలని కోరుకుంటాడు, దీంతో బెర్మే అతని వ్యతిరేకంగా లేచి పోరాడుతాడు. అయితే ఈ సినిమా వెయ్య కోట్లు మార్కును అధిగమిస్తుందని కన్నడ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’ కన్నడ ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా కూడా అదే ఊపు కనబరుస్తుంది. కాంతార చాప్టర్ 1 సినిమా కూడా వెయ్యి కోట్లు మార్కును అధిగమించాలని కన్నడ ప్రజలు కోరుకుంటున్నారు.
