raja-mouli( image :X)
ఎంటర్‌టైన్మెంట్

HBD Rajamouli: జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. ఎవరెవరు ఏం అన్నారంటే..

HBD Rajamouli: తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన 52వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విజనరీ డైరెక్టర్‌కు, తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటులు, సెలబ్రిటీలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎవరెవరు ఏం అన్నారంటే..

మహేష్ బాబు

రాజమౌళి అప్‌కమింగ్ మూవీ ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ హీరో మహేష్ బాబు, తన స్టైల్‌లో హ్యాపీ బర్త్‌డే విషెస్ తెలిపారు. మూవీ సెట్స్‌లో రాజమౌళితో కలిసి తీసుకున్న ఒక జాయ్‌ఫుల్ ఫోటోను షేర్ చేస్తూ, “వన్ అండ్ ఒన్లీ రాజమౌళికి హ్యాపీ బర్త్‌డే” అని రాసుకొచ్చారు.

ఎన్టీఆర్

ఎంతో ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు జక్కన్న అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ లో ‘స్టూడెంట్ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లింది.

రామ్ చరణ్

గొప్ప సినిమా దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. అంటూ రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ అప్పట్లో తెలుగు సినీ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ అయితే ఆస్కార్ వరకూ వెళ్లింది.

రాజీవ్ కనకాల

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవరో ఒకరు జీవన ప్రయాణాన్ని మర్చేస్టారు. నా జీవన ప్రయాణాన్ని మార్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?