Purisethupathi music: పూరి జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పూరిసేతుపతి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ‘యానిమల్’ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్థన్ రామేశ్వరన్ ఫిక్స్ అయ్యారు. హర్షవర్థన్ రమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు నిర్మాతలు. ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న హర్షవర్థన్ పూరి సినిమాకు చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే సరైన హిట్ కోసం చూస్తున్న పూరి ఈ కాంబోతో మరో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. మూవీ టీం పరంగా చూస్తే స్టార్ పవర్ తో నిండి ఉంది. అందులో ఈ డైనమిక్ సంగీత దర్శకుడు కూడా వచ్చి చేరడంతో ఈ సినిమాకు మరింత ఎసెర్ట్ కానుంది. దీనిని చూసిన అభిమానులు ఈ సారి పూరికి హిట్ ఖాయం అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హర్షవర్ధన్ తెలుగు లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
Read also-GHMC: రూ.1438 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్.. గతేడాదితో పోల్చితే రూ.103 కోట్లు అధికం
తెలుగు సినిమా దిగ్గజం పూరీ జగన్నాథ్ మరోసారి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నాడు. ఈ సారి అతని దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. టాబు, సంయుక్త మేనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ అన్‌టైటిల్డ్ మూవీని, తాత్కాలికంగా ‘పూరీసేతుపతి’ అని పిలుస్తున్నారు. పలు లొకేషన్ లలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇది ఒక న్యూ-ఏజ్ సోషల్ డ్రామా ఉండనుందని సమాచారం. దీనిని ‘రా అండ్ రియల్’ సినిమాటిక్ జర్నీగా వర్ణించబడుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, చర్మీ కౌర్ ప్రెజెంటేషన్‌లో జేబీ మోషన్ ఆర్ట్స్‌తో కలిసి రూపొందుతోంది. ఈ సినిమా ఎమోషనల్ డెప్త్‌తో కూడిన కథగా ఉంటుందని సమాచారం. పూరీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో ‘పోకిరి’తో మాస్టర్ మైండ్‌గా పేరుపొందిన పూరీ జగన్నాథ్, ఒక మల్టీ-టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్‌రైటర్, ఒక్కోసారి యాక్టర్‌గా కూడా కనిపించే ఈయన, తన యూనిక్ స్టైల్‌తో పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు పొందారు. 2000లలో తెలుగు సినిమాను షేక్ చేసిన ఈయన, ఇప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేస్తున్నారు. కన్నడలో పూనీత్ రాజ్‌కుమార్‌ను ‘అప్పు’ (2002)తో లాంచ్ చేశారు. యాక్టింగ్‌లో క్యామియోలు.. ‘బిజినెస్‌మ్యాన్’లో టాక్సీ డ్రైవర్, ‘టెంపర్’లో బైకర్, ‘గాడ్‌ఫాదర్’ (2022)లో గోవర్ధన్. ఫైట్ మాస్టర్స్‌తో (విజయన్, అలాన్ అమిన్) క్లోజ్ వర్కింగ్ ఫేమస్. అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల అయ్యే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
The blockbuster composer whose music speaks louder than words 🎵🎧
Team #PuriSethupathi welcomes National Award-winning music director @rameemusic on board ❤️🔥
Get ready for a new-age musical experience that blends action, emotion, and elevation 💥
A #PuriJagannadh film 🎬… pic.twitter.com/Ko50mIcZbq
— Puri Connects (@PuriConnects) October 9, 2025
