tsrtc ( Image Source: Twitter)
Viral, తెలంగాణ

TSLPRB Recruitment 2025: TSRTC రిక్రూట్‌మెంట్ 2025.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల కోసం దరఖాస్తులు

TSLPRB Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నారా? తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఇప్పుడు TSRTCలో 1743 డ్రైవర్, శ్రామిక్ (లేబర్) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 10వ తరగతి, 8వ తరగతి పాస్ అయినవారు, లేదా ITI కలిగినవారు దీనికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 8, 2025 నుంచి 28వ తేదీ వరకు ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసి, మీ కెరీర్‌ను పూర్తిగా మార్చుకోండి.

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదల తేదీ – సెప్టెంబర్ 17, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- అక్టోబర్ 8, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ – అక్టోబర్ 28, 2025 వరకు ఉంటుంది.

వయోపరిమితి

డ్రైవర్ పోస్ట్: 22 నుంచి 35 సంవత్సరాలు (జూలై 1, 2025 నాటికి) ఉండాలి.
శ్రామిక్ పోస్ట్: 18 నుంచి 30 సంవత్సరాలు (జూలై 1, 2025 నాటికి) ఉండాలి.
సడలింపు: తెలంగాణ ప్రభుత్వం ప్రకారం, అన్ని కేటగిరీలకు 12 సంవత్సరాల అదనపు సడలింపు SC/ST/BC/Ex-Servicemen వంటి రిజర్వ్డ్ కేటగిరీలకు మరిన్ని సడలింపులు వర్తిస్తాయి.

అర్హతలు

డ్రైవర్ పోస్ట్ లు:

విద్య: SSC (10వ తరగతి) లేదా సమానమైన పరీక్షలో పాస్ అయి ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్: సెప్టెంబర్ 17, 2025 (నోటిఫికేషన్ తేదీ) నాటికి కనీసం 18 నెలలు చెల్లుబాటు అయ్యే HPMV (హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్), HGV (హెవీ గూడ్స్ వెహికల్) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్.

శ్రామిక్ పోస్ట్ లు:

విద్య: 8వ తరగతి పాస్ + ITI సర్టిఫికెట్ (మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, వెల్డర్, అప్‌హోల్స్టరర్ వంటి ట్రేడ్‌లలో కలిగి ఉండాలి!
జనరల్: తెలంగాణ స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత. మెడికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి.

దరఖాస్తు రుసుము

డ్రైవర్ – జనరల్/ఇతరులు రూ.600, తెలంగాణ SC/ST/BC/లోకల్ రూ.300 ను చెల్లించాలి
శ్రామిక్ – జనరల్/ఇతరులు రూ.400, తెలంగాణ SC/ST/BC/లోకల్ రూ.200 ను చెల్లించాలి

చెల్లింపు: ఆన్‌లైన్ (క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI) రిఫండ్ లేదు. EWS/PWD/Ex-Servicemenకు ఫీ ఎక్సెంప్షన్ లేదా రిడ్యూస్‌డ్ (నోటిఫికేషన్ చెక్ చేయండి).

ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు

TSRTCలో డ్రైవర్లు – 1000
TSRTCలో శ్రామికులు – 743
మొత్తం – 1743

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!