Champion
ఎంటర్‌టైన్మెంట్

Champion: ‘ఛాంపియన్’గా శ్రీకాంత్ తనయుడు.. టార్గెట్ క్రిస్మస్!

Champion: శ్రీకాంత్ (Srikanth) తనయుడు, యంగ్ హీరో రోషన్ (Roshan) తన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఛాంపియన్’ (Champion)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) దర్శకత్వంలో.. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన ‘ఛాంపియన్’ ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్‌ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఇయర్ ఎండింగ్‌తో పాటు, క్రిస్మస్‌ను టార్గెట్ చేస్తూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ (Champion Movie Release Date) తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Dhruva Sarja: ‘సీతా పయనం’.. ధ్రువ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్.. గెస్ట్ రోలే కానీ!

హీరోయిక్ ఎంట్రీ

ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ‘చాంపియన్’ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. పండుగ సీజన్, న్యూ ఇయర్ హాలిడేస్‌తో వస్తున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ బిగ్ బూస్ట్ ఇవ్వనుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో రోషన్ లాంగ్ డార్క్ ఓవర్‌కోట్, బెల్టెడ్ వెయిస్ట్‌తో క్లాసీ లుక్‌లో.. ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెడుతూ హీరోయిక్ ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే, ఈ సినిమాతో నిజంగానే రోషన్ ‘ఛాంపియన్’ అవుతాడనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన కనిపించని కొత్త అవతార్ ఇది. ఆయన విభిన్న పాత్రలో కనిపించబోతుండటం, అందుకు సరిపడా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వెరసీ.. ఈ పోస్టర్‌తోనే సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌‌గా కొనసాగుతున్నాయని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.

Also Read- Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!

టాప్ టెక్నీషియన్స్..

రోషన్ సరసన అనశ్వర రాజన్ (Anaswara Rajan) నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే.. సినిమా టీమ్ మ్యాసీవ్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఎక్జయిట్‌మెంట్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ ఆర్. మధీ సినిమాటోగ్రఫర్‌గా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలలో రోషన్ బాగా వెనకబడి ఉన్నారు. ఆయనకు ఓ మంచి హిట్ పడితే మాత్రం.. ఇప్పుడున్న యంగ్ హీరోలతో కాంపిటేషన్‌కు రెడీ అయినట్లే భావించవచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mega concert 2025: ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. పెద్ది సాంగ్ వచ్చేది అప్పుడేనా?..

Telangana Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1,032 కోట్లు విడుదల.. డిప్యూటీ సీఎం ఆదేశం

EAD Policy: భారతీయులను ఇబ్బందిపెట్టేలా ట్రంప్ మరో నిర్ణయం.. అమెరికాలో ఉన్న మనోళ్ల ఉద్యోగాలకు ముప్పు!

Viral Video: సెలైన్ బాటిల్‌తో వీధుల్లో తిరిగిన రోగి.. అంత అర్జంట్ పని ఏంటో? ఇదిగో వీడియో

Yadadri Bhuvanagiri: అధికార పార్టీ నాయకుడి అండతో ఇష్టారాజ్యం.. ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తున్న వైనం!