Dhruva Sarja: ‘సీతా పయనం’.. ధ్రువ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్..
Dhruva Sarja
ఎంటర్‌టైన్‌మెంట్

Dhruva Sarja: ‘సీతా పయనం’.. ధ్రువ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్.. గెస్ట్ రోలే కానీ!

Dhruva Sarja: యాక్షన్ కింగ్, మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్ అర్జున్ సర్జా (Arjun Sarja) దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Sri Ram Films International) పతాకంపై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun), నిరంజన్ (Niranjan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను విశ్వక్ సేన్‌తో అర్జున్ ప్లాన్ చేయగా, ఆయన సడెన్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ సినిమాపై అర్జున్ చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ తీసుకొచ్చేలా.. సోమవారం యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా (Dhruva Sarja) బర్త్ డే స్పెషల్‌గా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!

శక్తివంతమైన పాత్రలో

యాక్షన్ హల్క్ ధ్రువ సర్జాను పరిచయం చేస్తూ విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఆయన చేస్తుంది గెస్ట్ రోల్ అనే విషయం తెలియంది కాదు. అయినప్పటికీ ఈ పోస్టర్‌లో ధ్రువ సర్జా ఇంటెన్స్ లుక్‌లో, శక్తివంతమైన పాత్రలో కనిపించారు. యాక్షన్ బ్లాక్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ధ్రువ సర్జా ఈ సినిమాలో ఓ కీలకమైన, పవర్ ఫుల్ పాత్రను పోషించినట్లుగా ఈ లుక్ స్పష్టం చేస్తోంది. ఆయన ఎంట్రీ సినిమా కథను మరింత మలుపు తిప్పే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్ కుటుంబంలోని ముగ్గురు కీలక సభ్యులు (అర్జున్, ఐశ్వర్య, ధ్రువ) కలిసి పనిచేయడం విశేషంగా మారింది. దర్శకుడు అర్జున్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Huma Qureshi: కుక్కలు చింపిన విస్తరిలా ఉంది.. ఈ టీషర్ట్ రూ.65 వేలట.. నటిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

ప్రధాన బలం వారే..

‘సీతా పయనం’ చిత్రానికి తారాగణం పెద్ద బలమనేలా టాక్ నడుస్తుంది. ఆ విషయాన్ని ఇటీవల వచ్చిన టీజర్ కూడా స్పష్టం చేసింది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌తో పాటు సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో భాగమయ్యారు. దీంతో నటీనటుల పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌గా మారనుంది. అలాగే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ (Anoop Rubens) సంగీతం, స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) మాటలు ప్రధాన బలంగా కానున్నాయని అంటున్నారు. అనూప్ సంగీతం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచి సినిమాకు మంచి బజ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బలమైన కథ, అద్భుతమైన నటీనటులు, అత్యున్నత సాంకేతిక విలువలతో అర్జున్ సర్జా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్రబృందం నమ్మకంతో ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..