Ari Trailer
ఎంటర్‌టైన్మెంట్

Ari Trailer: అరిషడ్వర్గాలపై డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Ari Trailer: ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (RV Reddy) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సైకో మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘అరి’ (Ari Movie). ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ (Vinod Varma), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.

Also Read- Mandaadi: సుహాస్ ‘మందాడి’ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. భారీగా నష్టం!

ట్రైలర్ ఎలా ఉందంటే..

ట్రైలర్ విషయానికి వస్తే.. సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఒక లైబ్రరీని చూపిస్తూ.. అక్కడ రివీల్ అయ్యే ఏడు జీవితాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. భూలోకంలో జన్మించాలని శ్రీకృష్ణుడు సంకల్పించగానే.. ఆ విషయం స్వర్గ లోకంలో ఉన్న ఆరుగురు దేవతలు తెలుసుకుని.. తమనూ భూలోకం తీసుకెళ్లమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు.. అవే అరిషడ్వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.. అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. ఇక్కడ అందరి కోర్కెలు తీర్చబడును అని ఓ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెలువడిన ప్రకటన చూసిన సినిమాలోని ప్రధాన పాత్రధారులు వచ్చి తమ కోర్కెలు చెబుతుండటం నిజంగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనషులందరిలో ఉండే అరిషడ్వర్గాలకు వారి కోర్కెలు ప్రతీకలుగా కనిపిస్తాయని చెప్పడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యంగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది.

Also Read- Sasivadane: ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు.. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు చూసుండరు

భగవద్గీత శ్లోకంతో ముగింపు

కోర్కెలు చెబుతున్న పాత్రధారుల నేపథ్యం ఏంటి? అసలు అక్కడ అందరి కోర్కెలు తీర్చే బాధ్యతను తీసుకున్నది ఎవరు? ఎందుకలా చేస్తున్నారు? తన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఇచ్చే టాస్క్‌లు ఏంటి? అనే ఇంట్రస్ట్‌ని ఈ ట్రైలర్ కలిగిస్తోంది. ఫైనల్‌గా ‘పరిత్రాణాయ సాధూనాం..’ అనే భగవద్గీత శ్లోకంతో ఈ ట్రైలర్‌ను ముగించిన తీరు కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా? అనే ఆసక్తిని కలిగిస్తోంది. ఓవరాల్‌గా అయితే, మేకర్స్ చెబుతున్నట్లుగా.. మైథలాజికల్ టచ్‌తో ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళుతుందనే భావనని మాత్రం ట్రైలర్‌తో ఇచ్చేశారు. వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!