Meenakshi Natarajan
తెలంగాణ

Meenakshi Natarajan: లోకల్ బాడీ ఎన్నికలకు నిఘా కమిటీలు? ముఖ్య నాయకులతో మీనాక్షి ఇంటర్నల్ మీటింగ్

Meenakshi Natarajan: లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిఘా కమిటీలను ఏర్పాటు చేయనున్నది. ఏఐసీసీ ఇన్ చార్జీ (AICC in-charge) మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆదేశాల మేరకు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ కమిటీలు ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ ఇచ్చిన బాధ్యతలను పర్యవేక్షిస్తాయి. అభ్యర్ధుల ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. మండలానికి ఓ కమిటీ ఏర్పాటుకు పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే కమిటీల విధి, విధానాలపై ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ ద్వారా డీసీసీలకు వివరించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ కమిటీలు ఏర్పటవుతాయని ఓ నేత తెలిపారు. ఒక్కొ కమిటీలో సుమారు పది మంది ముఖ్య లీడర్లు (Key Leaders) సమన్వయ కర్తలుగా పనిచేయనున్నారు. మండలం, జిల్లా కమిటీలను స్టేట్ బాడీ టీమ్స్ గాంధీభవన్‌లోని వార్ నుంచి కో ఆర్డినేట్ చేయనున్నాయి.

Also Read- Harish Rao: పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఎందుకంటే..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పవర్‌లో ఉన్నందున లోకల్ బాడీ టిక్కెట్లకూ డిమాండ్ ఏర్పడింది. దీంతో టిక్కెట్ లభించని ఆశావహులు పార్టీకి నష్టం చేకూరే చర్యలు చేపడతారనే అనుమానం అగ్రనాయకత్వంలో ఉన్నది. గతంలో కొన్ని జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి ఈ కొత్త నిబంధనను తెర మీదకు తీసుకువచ్చారు. ప్రభుత్వం, పార్టీ మైలేజ్‌తోనే అభ్యర్ధులు ఎవరైనా.. హస్తంను గెలిపించేందుకు క్షేత్రస్థాయి లీడర్లు పనిచేస్తున్నారా? లేదా? అనే అంశాన్ని ఈ నిఘా కమిటీలు ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి రిపోర్టు ఇవ్వనున్నాయి. పార్టీ మైలేజ్ తోనే పవర్ కుర్చీలు సొంతం చేసుకోవాలని మీనాక్షి ఆదేశాలిస్తున్నారు. దీంతో గ్రౌండ్ లెవల్‌లోని నేతల్లోనూ కాస్త టెన్షన్ ఏర్పడింది.

Also Read- Seethakka: కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాలి.. సీతక్క కీలక వ్యాఖ్యలు

ఇన్ చార్జ్‌లకు టాస్క్…?

స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలను గెలిపించే బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ బాధ్యతలు ఇన్ చార్జ్ మంత్రులు తీసుకోవాలంటూ మీనాక్షి తాజాగా సూచించినట్లు తెలిసింది. లోకల్ బాడీలో ఎక్కువ సీట్లు గెలిపించుకుంటూనే పార్టీ మరింత బలంగా ఉంటుందనేది ఏఐసీసీ ఇన్ చార్జ్ భావన. దీంతోనే ఆమె సీరియస్‌గా ఆదేశాలిచ్చారు. శనివారం ఆమె ఓట్ చోర్ పై జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పిలుపును కొందరు పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. నేతల్లో నిర్లక్ష్యం తగదన్నారు. పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఓట్ చోరీపై విస్తృతంగా ప్రోగ్రామ్ చేయాలన్నారు. సంతకాలు సేకరించాలన్నారు. బీజేపీ తప్పిదాలను జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?