Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన చేసిన వివాదాస్పద ట్వీట్స్ తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన.. తిరిగి కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) అధికారంలోకి రావాలంటూ పోస్ట్ పెట్టారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలకు దిగడంతో రాహుల్ రామకృష్ణ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ట్విటర్ యాక్టివిజంకు దూరంగా ఉంటానంటూ రాహుల్ మరో పోస్ట్ పెట్టారు. ఇకపై వివాదాల జోలికి పోకుండా.. సినిమాల వరకే పరిమితం అవుతానని పరోక్షంగా స్పష్టం చేశారు.
నటుడు ఏమన్నారంటే?
నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ లో మరోమారు పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచారు. ‘నా కంటే గొప్ప మేధావులు సమాజ సమస్యలపై ఎన్నాళ్లుగానో ఆలోచిస్తూ వచ్చారు. పాలన, పరిపాలన గురించి నాకేం తెలుసు? నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమే. పలువురు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో ఫోన్‌లో దీర్ఘకాలిక సంభాషణలు జరిపిన తర్వాత నాకు ఒక స్పష్టత వచ్చింది. నా ఆవేశం, నిరాశ రాంగ్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఎవరు పాలించినా? ఎలా పాలించినా? మన నేలకు మన ప్రజలకు మంచి జరగాలన్నదే నా కోరిక’ అని అన్నారు.
Greater minds than mine have long grappled with social problems. What do I know about governance and administration? I’m just a small actor.
After several long phone calls with seasoned leaders from the entire political spectrum, I have come to realise that my angst and my…— Rahul Ramakrishna (@eyrahul) October 4, 2025
‘నా బాధ్యత తెలుసుకున్నా’
‘సిస్టమ్‌ను విమర్శించడం మాత్రమే కాదు. దానితో కలిసి పనిచేయడం నా బాధ్యత. మన అందరినీ వేధిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు నా పరిమిత సామర్థ్యంతో సహాయం చేయగల సమయం వచ్చే వరకు.. నేను ఈ ట్విట్టర్ యాక్టివిజం నుండి తప్పుకుంటున్నాను. ఇకపై నన్ను తెరపైన చేసే ఉత్తమ పనుల ద్వారా మాత్రమే చూస్తారు’ అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ లో రాసుకొచ్చారు.
Also Read: Strange Incident: దసరాకు సెలవు పెట్టాడని.. జాబ్ నుంచి తీసేశారు.. వామ్మో ఏందయ్యా ఇది!
వివాదం ఏంటంటే?
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) రాజకీయ, వ్యక్తిగత నిరాశల కలబోతగా చేసిన వరుస ట్వీట్లు ఇటీవల తీవ్ర కలకలం రేపాయి. ఓ ట్వీట్‌లో తన వ్యక్తిగత నిరాశను తెలియజేస్తూ.. ‘‘నేను విసిగిపోయా. నన్ను చంపేయండి’’ అని పేర్కొనడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. మరొక ట్వీట్‌లో ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. ‘‘హైదరాబాద్ మునిగిపోయింది. హామీలన్నీ విఫలమయ్యాయి. వీటిని చక్కబెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్’’ అంటూ ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అతడిపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఆయన తన ఎక్స్ ఖాతాను హోల్డ్ చేసేశారు. తిరిగి తాజా పోస్టుతో ఈ వివాదానికి తెరదింపే ప్రయత్నం చేశారు.
