mirai-ott-streeming( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Mirai OTT release: ‘మిరాయ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Mirai OTT release: తేజ సజ్జా హీరోగా నటించి సూపర్ హీరో చిత్రం ‘మిరాయ్’ ఓటీటీకి వచ్చే డేట్స్ చెప్పేశారు నిర్మాతలు. ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేసింది జియో హాట్ స్టార్ సంస్థ. అయితే ఈ సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హీరో సినిమాల జోనర్లో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీకి రావడంపై తేజ సజ్జా అభిమానులు సంతోష పడుతున్నారు. థ్రియేట్రికల్ గా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Read also-The Raja Saab: ‘ది రాజా సాబ్’ నుంచి మరో అప్డేట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

సినిమా కథ శతాబ్దాల క్రితం ఆసకురాజు చేత ప్రారంభమవుతుంది. అమరత్వ రహస్యాన్ని తొమ్మిది పవిత్ర గ్రంథాల్లో ముద్రించి, తన విశ్వసనీయ రక్షకులకు అప్పగించిన ఆసకురాజు కథ. ఆ తొమ్మిది గ్రంథాలు ఏ మనిషినైనా దేవుడిని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. తరాల తర్వాత, అంబిక (శ్రీయా శరణ్) అనే మహిళ, భవిష్యత్తును దర్శించగల సామర్థ్యం కలిగినవారిలో ఒకరు, తొమ్మిదో గ్రంథానికి రక్షకురాలిగా ఉంటుంది. ఆమె మహాబీర్ లామా (మనోజ్ మంచు) అనే క్రూరుడు ఈ గ్రంథాలను సంపాదించి అమరత్వం పొంది ప్రపంచాన్ని పాలించాలని ప్రణాళిక వేస్తున్నాడని భవిష్యత్తులో చూస్తుంది. మహాబీర్ కొన్ని గ్రంథాలను స్వాధీనం చేసుకున్నా, మిగిలినవాటిని కోరుకుంటూ వెంటాడతాడు. ఆమె ఈ ప్రమాదాన్ని ఆపడానికి, హైదరాబాద్‌కు చెందిన వేద ప్రజాపతి (తేజా సజ్జా) భవిష్యత్తును ఈ గ్రంథాల వారసత్వంతో ముడిపెడతుంది. మిథాలజీ, మోడర్నిటీ కలిసిన ఈ కథలో మంచి-చెడు యుద్ధం ప్రధానంగా ఉంటుంది. వేద పాత్ర, గ్రంథాల శక్తి, మహాబీర్ ప్రేరణలు, విభా (రితికా నాయక్) మిస్టరీతో సంబంధం, మిరాయ్ నిజమైన స్వభావం వంటి ప్రశ్నలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Read also-Jagtial District: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం.. భయంతో విద్యార్థులు పరుగులు

‘మిరాయ్’లో తేజ సజ్జా పాత్ర రెండు షేడ్స్‌తో ఉంటుంది. మొదటి అర్ధంలో నిర్విరామ యువకుడిగా, రెండో అర్ధంలో నిర్ణయాత్మక శక్తిగా పరివర్తన చెందుతుంది. ఇది అతని కెరీర్ బెస్ట్ నటనల్లో ఒకటి. విలన్ మహాబీర్ లామాగా మనోజ్ మంచు స్క్రీన్‌ను డామినేట్ చేశారు. అతని కళ్ళలో ఆగ్రహం, స్వరంలో ఆధిపత్యం, డైలాగ్ డెలివరీలో ఇంపాక్ట్ చూపించారు. అతనికి పర్ఫెక్ట్ రోల్. శ్రీయా శరణ్ ఎమోషనల్ డెప్త్‌తో కీలక సీన్స్‌ను ఎలివేట్ చేసింది. ఆమె గ్రేస్ సినిమాను మరింత బలపరిచింది. రితికా నాయక్ విభాగా సరిగ్గా నటించినా, ఆమె పాత్ర మరింత డెవలప్‌మెంట్ అవ్వాల్సింది. సపోర్టింగ్ కాస్ట్‌లో జగపతి బాబు, జయరామ్, గెటప్ శ్రీను మంచి ఇంప్రెషన్ ఇచ్చారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!