Alai Balai 2025 (imagecredit:swetcha)
తెలంగాణ

Alai Balai 2025: అలయ్ బలయ్ వల్ల ఇలాంటి పరిస్థితి రాదు?: వెంకయ్యనాయుడు

Alai Balai 2025: కుల మతాలతో మనుషుల మధ్య చీలకలు వస్తున్నాయని, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అలయ్ బలయ్ అంటే ఒకరికొకరు కలసి ఉండాలని సూచించే కార్యక్రమమని వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శుక్రవారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి అధ్యక్షతన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన పలువురికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. అలయ్ బలయ్ లాంటి కార్యక్రమం వల్ల ప్రజల మధ్య చీలిక వచ్చే పరిస్థితి లేదన్నారు. దేశం మొత్తం ఒకే తాటిపై ఉందని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ఉద్యమంలో.. ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో వెళ్తుంటే అంతా ఒక్కటేనని చెప్పిన వ్యక్తి దత్తాత్రేయ అని కొనియాడారు. అందరూ కలిసి మెలిసి ఉండాలని.. సూచించే కార్యక్రమం అలయ్ బలయ్ అని వివరించారు. త్వరలో జరగబోయే స్థానికసంస్థల ఎన్నికలు శాంతియుతంగా జరగాలని కోరారు. రాజకీయాలకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కావాలని ఆశించారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

20 సంవత్సరాలుగా అలయ్ బలయ్ కొనసాగుతోందన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒకే తాటిపై తెచ్చిన నాయకుడు దత్తన్న అంటూ ఈటల కొనియాడారు. ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడితో మాట్లాడితే నేరంగా భావిస్తున సమయంలో అందరినీ ఏకం చేసే వ్యక్తి దత్తన్న అంటూ చెప్పుకొచ్చారు. తనలాంటి వారికి దత్తాత్రేయ ఎంతో ఆదర్శమని కొనియాడారు.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బండారు దత్తాత్రేయను చూస్తే ఏ పార్టీ అనే విషయాన్ని కూడా మర్చిపోతామని, ఒక పార్టీకి ఆయన బాధ్యత వహించినా.. మిగతా పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లే వ్యక్తి అంటూ కొనియాడారు. ప్రాంతాలకు, కులమతాలకతీతంగా ఉన్న వేదిక అలయ్ బలయ్ గా చెప్పుకొచ్చారు. ఎన్నికలప్పుడే.. పార్టీలని, ఆ తర్వాత అందరూ కలిసి ఉండాలని కోరారు. అలయ్ బలయ్ నిత్యం కొనసాగాలన్నారు.

Also Read: Money Lending Act: రైతులకు మనీ లెండింగ్ యాక్ట్ అమలు.. త్వరలో రానున్న చట్టం

20 సంవత్సరాలుగా అలయ్ బలయ్

ఇదిలా ఉండగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సన్మానించారు. కాగా కవితను సైతం అలయ్ బలయ్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి సన్మానించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా అలయ్ బలయ్ కొనసాగుతోందని, కుల, మత, రాజకీయాలకు అతీతమైన వేదిక అలయ్ బలయ్ అని వివరించారు. దత్తన్న అంటే.. గవర్నర్ గానో, రాజకీయంగానో కాకుండా పక్కా తెలంగాణవాదిగా అందరికీ సుపరిచితమని కొనియాడారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన తనయ విజయలక్ష్మి కొనసాగించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

మేజర్ జర్నల్ అజయ్ మిశ్రా

మేజర్ జర్నల్ అజయ్ మిశ్రాకు అలయ్ బలయ్ కమటీ సన్మానం చేసింది. అనంతరం అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ భారత మిలటరీ చరిత్రలో గొప్ప ఆపరేషన్ గా అభివర్ణించారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర చర్యలకు ఆపరేషన్ సింధూర్ ఒక సమాధానమన్నారు. టెర్రరిజం చేసేవారితో చర్చలు ఉండవని ప్రధాని మోడీ చాలా క్లియర్ గా చెప్పారని గుర్తుచేశారు. అనంతరం సినీ హీరో నాగార్జునను అలయ్ బలయ్ కమిటీ సన్మానించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సన్మానం తనకు ఎంతో ప్రత్యేకమని, ఎంతో కొత్తగా ఉందని కొనియాడారు. రాజకీయాలకతీతంగా అలయ్ బలయ్ నిర్వహించడం ఎంతో గ్రేట్ అని కొనియాడారు. రాజకీయాలకతీతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తమలాంటి వారికి మంచి కాన్ఫిడెంట్ ఇస్తుందన్నారు. అనంతరం హాస్య నటుడు బ్రహ్మానందంను కమిటీ సభ్యులు సన్మానించారు.

శాంతి కరువవుతున్న సమయం

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలయ్ బలయ్ కార్యక్రమం చేసుకోవడమంటే ఒకరికొక్కరు ప్రేమ పంచుకోవడమని వివరించారు. పూర్వీకుల నుంచి అలయ్ బలయ్ సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. శాంతి కరువవుతున్న సమయంలో ఇలాంటి అలయ్ బలయ్ కార్యక్రమం జరగాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. దత్తాత్రేయ పట్టువదలని విక్రమార్కుడిలా ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి పరిణామంగా ఆయన కొనియాడారు. అలయ్ బలయ్ వేడుకలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు కే లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరావు, రఘునందన్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రమణ, ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సృజనా చౌదరి, మాజీ గవర్నర్ విద్యాసాగర్, సీపీఐ ఆగ్రనేత కే నారాయణ, కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Varun Tej baby: మెగా వారసుడి పేరు ప్రకటించిన వరుణ్ తేజ్.. ఏంటంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!