Local Body Elections: ఆ గ్రామపంచాయతీలకు నిరాశే ఎదురైంది. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండటంతో అడ్డంకిగా మారింది. ఎన్నికల కమిషనర్ సైతం స్పష్టంగా ప్రకటించారు. ఎన్నికలు నిర్వహించడం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో 14 ఎంపీటీసీ స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 246 గ్రామవార్డులకు నిర్వహించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలుతుంది. ములుగు(Mulugu) జిల్లాలోని మంగపేట మండలంలోనే 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులు ఉన్నాయి. అదే విధంగా కరీంనగర్(Karimnagar) జిల్లాలోని రెండు గ్రామపంచాయతీలు, 16వార్డులు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎంపీటీసీ(MPTC), 27 గ్రామపంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇవి తప్ప రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Also Read: DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి
మంగపేట మండలంలోని ఎంపీటీసీ స్థానాలు ఇవే
కమలాపూరం-1, కమలాపూరం-2, కమలాపురం-3, మంగపేట, నర్సాపూర్, కోమటిపల్లి, చెరుపల్లి, తిమ్మంపేట, మల్లూరు, నర్సింహ్మాసాగర్, రామనక్కపేట్, రాజుపేట్, కత్తిగూడెం, దొమ్మెడ.
మంగపేటమండలంలోని గ్రామపంచాయతీలు ఇవే:
కమలాపూరం, మంగపేట్, నర్సాపూర్ బూరె, కోమటిపల్లి,కొత్తూరుమోట్లగూడెం, చెరుపల్లి,బాలన్నగూడెం, నర్సాయిగూడెం, బుచ్చంపేట, తిమ్మంపేట, మల్లూరు, నర్సింహ్మాసాగర్, పూరెద్దుపల్లి, రమనక్కపేట్, చుంచుపల్లి, వేదగూడెం, రాజుపేట్, రామచంద్రునిపేట్, వాగొడ్డుగూడెం, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లె, అక్కెనెపల్లి మల్లారం, దొమ్మెడ, నిమ్మగూడెం. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని వి.సైదాపూర్ మండలంలో గల కుర్మపల్లి, రామచంద్రపూర్ గ్రామాలకు కోర్టు స్టే ఉండటంతో ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. కోర్టు ఓకే చెప్పిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Also Read: Gajwel News: మరింత విస్తరించనున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ.. ఎలాగో తెలుసా!
