Sagar Singareni Movie: బుల్లి తెర ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన మొగలిరేకులు సాగర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇటీవల ‘ది 100’ అనే యాక్షన్ సినిమా తీసి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా హీరో సాగర్ మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు సాగర్ ముందడుగు వేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికుల దుర్భలమైన జీవితాలు, వారి కష్టాల్ని తెరపై ఆవిష్కరించేందుకు ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు. ‘జార్జి రెడ్డి’ చిత్రంతో మేకర్‌గా జీవన్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌పై సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు.
సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతదేశ సినీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మైనింగ్ ప్రాంతాల కఠినమైన వాతావరణం, కార్మికుల దినచర్య, వారి త్యాగాలు వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన చేశారు. ఈ మూవీలో హీరోగా సాగర్ నటించనున్నారు. ముఖ్య పాత్రలో ప్రముఖ స్టార్ హీరోని తీసుకోబోతోన్నారని సమాచారం. ఈ స్పెషల్ కారెక్టర్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం తీసుకోనున్నారు.
Read also-OTT Movie: అనుకోకుండా కలిసిన స్నేహం అనుమానాలతో ఆవిరవుతుంటే!.. ఇలాంటి వారు మీకూ ఉంటారు..
స్వతాహాగా సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన సాగర్.. తాను చూసిన జీవితాల్ని, పాత్రల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు శ్రమిస్తున్నారు. భారీ సెట్స్ (అండర్ గ్రౌండ్ బొగ్గు గని సెట్టింగ్స్)లో సహజత్వానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరణ జరగడం ఈ సినిమా నిర్మాణ విలువలను తెలియజేస్తుంది. నవంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టుగా టీం ప్రకటించింది. ఇప్పటికే ది 100 తో మంచి ఉత్సాహంలో ఉన్న సాగర్. ఈ సినిమాను కూడా టేకప్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం సాగర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 2025లో విడుదలైన”ది 100″ తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాను రాఘవ్ ఒంకార్ శశిధర్ రాసి, డైరెక్ట్ చేశారు. మొగలిరేకులు సీరియల్‌లో ప్రసిద్ధి చెందిన ఆర్‌కే సాగర్ హీరోగా ఈ సినిమాలో డెబ్యూ చేశారు. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మా ప్రొడక్షన్స్ లో రూపొందింది.
