Money Lending Act: రైతులకు రైతు కమిషన్ బాసటగా నిలిచింది. కమిషన్ ఏర్పడిన ఏడాదిలోనే రైతులను మోసగిస్తున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. పరిహారం ఇప్పించడంలోనూ సక్సెస్ అయింది. ఎప్పటికప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి పరిష్కరించేందుకు కమిషన్ కృషిచేస్తుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, మార్కెట్ల సందర్శన, మరోవైపు అధికారులు, బాధిత రైతులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయరంగ సమస్యలపై దృష్టిసారించింది.
చాలామంది రైతులు సూసైడ్..
రాష్ట్రంలో విత్తనోత్పత్తి రైతులకు విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో రైతు కమిషన్ కీలక పాత్ర పోషించింది. ములుగు(Mulugu) జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు దాదాపు 4 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా సీడ్ కంపెనీల నుంచి వచ్చేలా చేసింది. గద్వాల్ లో పత్తి, సూర్యాపేట(Suryapet) లో వరి, ఖమ్మం(Khammam) లో మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు సైతం నష్టపరిహారం అందించేలా కృషిచేసింది. అదే విధంగా మనీ లెండింగ్ యాక్ట్ అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడంలో రైతు కమిషన్ సక్సెస్ అయింది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రైవేట్ అప్పులు చేసి చాలామంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. అసలు, వడ్డీ కట్టలేక చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలుఉన్నాయి. రాష్ట్రంలో గత పదేండ్ల కాలంలో రైతుల ఆత్మహాత్యలకు ప్రధాన కారణం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులేనని రైతు కమిషన్ విచారణలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్లేం వేయాలంటే.. మనీ లెండింగ్ యాక్ట్ పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వానికి రైతు కమిషన్ సూచన చేసింది. మనీ లెండింగ్ యాక్ట్ అమలు చేస్తేనే రాష్ట్రంలో రైతాంగానికి రక్షణ ఉంటదని వివరించింది.
రాష్ట్రంలో చెరువులు కబ్జా..
చిన్న పాటి చెరువుల వద్ద నీటి సంఘాల ఏర్పాటు కు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. కొందరు అక్రమదారులు వెంచర్లు వేసి అడ్డగోలుగా దండుకుంటున్నారు. చెరువుల పరిరక్షణ బాధ్యతను గత ప్రభుత్వం సరిగ్గా చేపట్టలేదు. పైగా చెరువుల అభివ్రుద్ది చేయకపోవడంతో భూగర్భజలాలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో వున్న చెరువుల రక్షణ, భూ గర్బజలాలు కాపాడాలన్నా నీటి సంఘాలు అవసరమని స్పష్టం చేసింది.దసరా తర్వాత నీటి సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. దానికి కావాల్సిన కసరత్తు చేస్తున్నారు.
Also Read: Rajasthan Bride: శోభనం రోజున వరుడికి బిగ్ షాక్.. వధువు దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ఏమైందంటే?
తప్పని సరిగా పంట రుణాలు..
విత్తన చట్టం తీసుకొచ్చేందుకు కృషిచేస్తుంది.ఈవిత్తన చట్టంతో నకిలీ విత్తనాలు అరికట్టవచ్చని రైతులకు విత్తన చట్టం రక్షణగా ఉంటదని చెప్పడంతో ప్రభుత్వం విత్తన చట్టం ముసాయిదా రూపొందించడానికి కమిటీ వేసింది. ఆ కమిటీ చేస్తున్న విత్తన చట్టం ముసాయిదా తుది దశలో ఉంది. అదే విధంగా పోడు పట్టాలున్న రైతులకు పంటరుణాలు ఇచ్చేలా కమిషన్ సూచన చేసింది.ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులకు పోడు పట్టాలున్నాయి. కానీ వివిధ కారణాల వల్ల గిరిజన రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారు. బ్యాంకర్లు సైతం పంటరుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ విషయం కమిషన్ దృష్టికి రావడంతో.. ఐటీడీఏ(ITDA), గిరిజన సంక్షేమ శాఖ, బ్యాంకర్లు, ఫారెస్ట్ అధికారులు, గిరిజన రైతులతో సమావేశం నిర్వహించింది. గిరిజన రైతులకు పోడు పట్టాలుంటే.. తప్పని సరిగా పంట రుణాలు ఇచ్చేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో చొరవ తీసుకొని పోడు పట్టాలున్న గిరిజన రైతులకు పంటరుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. దసరా తర్వాత ఇది అమల్లోకి రానున్నట్లు సమాచారం. అదే విధంగా ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ప్రభుత్వం ఆమోదిస్తుందని రైతు కమిషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అండగా రేవంత్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షంలో ఉన్నపుడు అధికారం లోకి వస్తే వ్యవసాయ రైతు వెల్ఫేర్ కమిషన్ వేస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీమేరకు కమిషన్ ను వేసిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. కమిషన్ ఏర్పాటు చేసి ఒక ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి రైతు సమస్యలను అధ్యాయనం చేశామన్నారు. విత్తనం ముఖ్యమైనదని అయితే దానిని విత్తనం కంపెనీలా గుప్పెట్లో పెట్టుకున్నాయని, ములుగు విత్తనం అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనం చట్టం అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే రాష్ట్రంలో విత్తనం చట్టం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూమి హక్కు పత్రాలు లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారని, సమగ్రమైన భూభారతి చట్టం తీస్కోచి వేగంగా భూ సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ముఖ్యమైందని దానిపై నిష్ణాతుల చేత చర్చలు చేశామని త్వరలోనే మైనర్ నీటి వ్యవస్థను ఏర్పాటు కాబోతుందన్నారు. ప్రైవేట్ వ్యాపారస్తుల చేత రైతులు నష్టపోతుండటంతో ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తితో మనీ లేండింగ్ చట్టం అమలు చేయాలని కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చారన్నారు.
Also Read; Hyderabad Police: సిమెంట్ బస్తాల ముసుగులో.. రూ.6.25 కోట్ల గంజాయి రవాణా ఎక్కడ పట్టుకున్నారంటే?