Hyderabad schools drugs
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad: ఆ స్కూల్స్ కు.. పంపాలంటే భయం !!

భాగ్యనగరవాసులను భయపెడుతున్న రిచ్ స్కూల్స్
ధనవంతుల బిడ్డలు చదివే స్కూల్స్ ను టార్గెట్ చేసిన మాఫియా
చిన్నారులకు యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా
గత కొన్ని సంవత్సరాలుగా పోలీసుల కళ్లు కప్పి చేస్తున్న వ్యాపారం
8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులే లక్ష్యం
చాక్లెట్స్ రూపంలో రహస్యంగా అమ్మకాలు
స్కూల్ క్యాంటీన్ వర్కర్లతో కుమ్మక్కు
19 స్కూళ్లను గుర్తించిన పోలీసులు
అప్రమత్తంగా ఉండాలని స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక


Hyderabad 19 rich status schools recognised drugs supply:
హైదరాబాద్ లో ధనవంతుల పిల్లలు చదివే స్కూల్స్ లో గత కొన్నేళ్లుగా విచ్ఛలవిడిగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. ముఖ్యంగా 8వ తరగతి విద్యార్థులనుంచే డ్రగ్స్ సరఫరా చేస్తూ వాళ్లను మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఆడపిల్లలు కూడా ఉండటం గమనార్హం. అయితే పోలీసు లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో దాదాపు వెయ్యికి పైగా చిన్నారులు ఈ డ్రగ్స్ కు బానిసలుగా మారినట్లు తెలుస్తోంది. వేసవి సెలవల అనంతరం మళ్లీ స్కూళ్లు ప్రారంభించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆయా స్కూల్ యాజమాన్యాలను అప్రమత్తం చేస్తున్నారు.

19 పాఠశాలల్లో విచ్ఛలవిడిగా..


పోలీసులు వెల్లడించిన జాబితా ప్రకారం టాప్ రేంజ్ లో ఉన్న 19 పాఠశాలల్లో డ్రగ్ కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్కూల్స్ లిస్ట్ లో మీ పిల్లలు చదువుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చదివితే మాత్రం వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకవేళ నిజంగానే మీ చిన్నారులు డ్రగ్స్ వినియోగానికి బానిసైతే మాత్రం తక్షణమే వైద్యం అందించేందుకు అలక్ష్యం చేయొద్దు.

డ్రగ్ మాఫియా గుప్పిట్లో..

ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలోని 19 టాప్ మోస్ట్ స్కూల్స్ , 14 టాప్ ఇంజనీరింగ్, ఢిగ్రీ కళాశాలలు డ్రగ్ మాఫియా గుప్పిట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా స్కూల్స్ పేర్లు కూడా బయటకొచ్చాయి. అయితే సమగ్ర సమాచారం లేకనో లేక సంపన్నుల పిల్లలు చదువుతున్న పాఠశాలలు కావడంతోనో కానీ ఆ జాబితాను పోలీసులు వెల్లడించడంలేదు. ప్రయివేటు విద్యాసంస్థలు కాబట్టి వారి పేర్లను వెల్లడించడంలో పోలీసులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని విద్యాసంస్థల్లో కూడా డ్రగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సేకరించిన లిస్టులో ఉన్న పాఠశాల విద్యార్థుల్లో మాత్రం ప్రతి 10 మందిలో ఇద్దరు నుంచి ముగ్గురు డ్రగ్స్ బానిసలుగా మారుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.అందుకే స్టూడెంట్స్ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అందులో భాగంగా సివిల్, నార్కొటిక్స్ పోలీసుల సమన్వయంతో ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసింది. మఫ్టీలో ఉండే టీమ్స్ స్కూల్స్ పరిసరాల్లో డ్రగ్స్ విక్రయించే పాన్ షాపులు, కిరాణ కొట్లపై నిఘా పెట్టనున్నాయి. అలాగే పాఠశాలల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుదని హెచ్చరించినట్లు తెలిసింది.

ఇంటర్నేషనల్ స్కూల్స్‌పై ఫోకస్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు ఇంటర్నేషనల్ స్కూల్స్ పరిసరాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. గతేడాది ఆ స్కూల్స్ పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్ చాక్లెట్లు విచ్చలవిడిగా లభ్యమైనట్లు నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ స్కూల్స్ పరిసరాల్లో డ్రగ్స్ పెడ్లర్ల కదలికలను గుర్తించడం, పాన్ షాపులపై ప్రత్యేకంగా నిఘా పెట్టేందుకు టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఆ టీమ్ లో మఫ్టీలో స్థానిక పోలీసులు,నార్కొటిక్స్ విభాగానికి చెందిన పోలీసులు ఉంటారు. స్కూల్స్ పరిసరాలు, అలాగే పిల్లల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నారు. కొన్ని స్కూల్స్ లో క్యాంటిన్ లో పనిచేసే వర్కర్లతో పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. చాక్లెట్స్ రూపంలో అమ్మకాలు సాగిస్తే ఎవరికీ అనుమానం రాదని డ్రగ్స్ అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

యాజమాన్యాలదే బాధ్యత

ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఓ రిటైర్డ్ ఐపీఎస్, సైక్రియాటిస్టుతో పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని మేనేజ్‌మెంట్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డ్రగ్స్ తీసుకుంటే తలెత్తే ఆరోగ్య సమస్యలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించింది. అలాగే స్కూల్స్‌లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు గత వారం ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు నార్కొటిక్ విభాగం సర్క్యులర్స్ జారీ చేసినట్లు సమాచారం.

Just In

01

Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన