dimple-hayathi(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..

Dimple Hayathi: మాస్ మహారాజ్, హీరోయిన్ డింపుల్ హయాతి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తాజాగా ఆమెపై ఫిల్మిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది. డింపుల్ ఇంట్లో పనిమనిషి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హయాతీ ఇంట్లో కుక్కలను చూసుకోవడానకి ఒడిశా నుంచి ఇద్దరు యువతులను తీసుకొచ్చారు. రెండు రోజులు బాగానే వారిని చూసుకున్నారట. ఆ తర్వాతే వారిని హింసించడం, దూషించడం వంటివి చేస్తున్నారని, ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్లగొట్టారని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఇప్పుడు హీరోయిన్ హయాతిపై కేసు నమోదైంది.

Read also-Viral Video: రైల్వే స్టేషన్స్‌లో నీళ్లు తాగుతున్నారా? ఇది చూస్తే ఎప్పటికీ ఆ ధైర్యం చేయరు!

కేసులో..

డింపుల్ ఇంట్లో పనిమనిషి ప్రియాంక ఇచ్చిన పిర్యాదు మేరకు డింపుల్ హయాతితో పాటు ఆమె భర్త డేవిడ్ లపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. డింపుల్, ఆమె భర్త డేవిడ్ లు ఆకారణంగా తమ పై దాడికి యత్నించారని, దుర్భషలాడుతూ దారుణంగా తిట్టారని, ఎంత బతిమిలాడినా వినకుండా.. నా తల్లిదండ్రులను చంపేస్తాం అని బెదిరించి.. మొబైల్ లో వీడియో తీసే ప్రయత్నం చేస్తే.. మొబైల్ లాక్కుని పగులగొట్టారు. నేను తప్పించుకునే ప్రయత్నం లో నా బట్టలు చినిగిపోయాయంటూ పిర్యాదు లో పేర్కొంది బాధితురాలు ప్రియాంక. ఇంత దారుణంగా ప్రవర్తించిన డింపుల్ హయాతి, ఆమె భర్త డేవిడ్ లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఫిల్మ్ నగర్ పోలీసులు.

Read also-CM Revanth Reddy: ఈ నెల 5నాటికి జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

వైరల్ వీడియో..

తాజాగా వివాదానికి సంబంధించి ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులను నియమించుకున్నారట. రెండు రోజులు బాగానే వారిని చూసుకున్నారట. ఆ తర్వాతే వారిని హింసించడం, దూషించడం వంటివి చేస్తున్నారని, ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్లగొట్టారని ఈ వాయిస్‌లో చెబుతున్నారు. అంతే కాదు, ఆ ఇద్దరు యువతులు డింపుల్ హయాతి ఉంటున్న అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న రోడ్డుపైనే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. ఇప్పటి వరకు పని చేయించుకున్నందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా.. బలవంతంగా పనులు చేయించుకున్నారని, ‘మీరెంత.. మీ బ్రతుకులెంత.. నా చెప్పుల ఖరీదు కూడా చేయరు’ అంటూ డింపుల్ భర్త దూషిస్తే.. ‘నా భర్త లాయర్’ అంటూ.. హీరోయిన్ డింపుల్ హయాతి వారిని బెదిరించినట్లుగా ఈ వీడియోలో ఆరోపణలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Idly Kottu review: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కొట్టు’ ఎలా ఉందంటే?

Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!

ibomma Warning: టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ వార్నింగ్.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు

Kadiyam Srihari: ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు.. కడియం శ్రీహరి కీలక వాఖ్యలు

Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు