Ponguleti Srinivasa Reddy ( image credit: twitter)
తెలంగాణ

Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ పాల‌న‌లోనే గ్రూప్ -1 నియామ‌కాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Ponguleti Srinivasa Reddy: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగులు క‌న్న క‌ల‌లు గ‌డిచిన ప‌ది ఏళ్లలో క‌ల‌లుగానే మిగిలాయ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ -1  (Group-1 )నియామకాల్లో ఎంపికై స్టాంప్స్ ,రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో జిల్లా రిజిస్ట్రార్‌లుగా నియ‌మితులైన పలువురు అభ్యర్థులు సచివాలయంలో మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని, ఈ కీలక సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు.

 Also Read: Vijay Breaks Silence: సీఎం సార్.. నా వాళ్లను టచ్ చేయొద్దు.. తొక్కిసలాటపై తొలిసారి విజయ్ స్పందన

కాంగ్రెస్ హ‌యాంలో 2011 లో గ్రూప్ -1 కు నోటిఫికేషన్ జారీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ హ‌యాంలో 2011 లో గ్రూప్ -1 కు నోటిఫికేషన్ జారీ చేయగా, 2018 లో భర్తీ ప్రక్రియ పూర్తయిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే గ్రూప్ 1 నియామకాలు భర్తీ అయ్యాయన్నారు. పదేళ్ల పాటు నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందన్నారు. ఉద్యోగాల భర్తీ, పేదలకు సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు.

60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ

గతంలో ప్రశ్నాపత్రాలు కూడా లీకైన పరిస్థితిని చూశామన్నారు. కానీ తాము పవర్ లోకి వచ్చాక టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని అవినీతి అక్రమాలకు అడ్డుక‌ట్ట వేస్తున్నామ‌ని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ కు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు.

 Also Read: Seethakka: విద్యా రంగంలో కొత్త అధ్యాయం.. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ.. ఏర్పాటు అక్కడే?

Just In

01

Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!

Khammam: ఖమ్మం జిల్లాలో శ్రీ కోటమైసమ్మ తల్లి అతి పెద్ద జాతర.. ఈ విశిష్టత కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..

Viral Video: రైల్వే స్టేషన్స్‌లో నీళ్లు తాగుతున్నారా? ఇది చూస్తే ఎప్పటికీ ఆ ధైర్యం చేయరు!