OG New Updates
ఎంటర్‌టైన్మెంట్

OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

OG New Updates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు మరోసారి థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్న ‘ఓజీ’ (They Call Him OG) సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన కొన్ని కీలక అప్‌డేట్స్, ప్రేక్షకులను, అభిమానులను మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 250 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దసరా ఫెస్టివల్ కావడంతో ఇంకా ఈ సినిమా మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని న్యూ అప్డేట్స్ వచ్చాయి. అవేమిటంటే..

Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు టికెట్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఎంత పెంచారంటే..?

తగ్గిన టికెట్ ధరలు, పెరిగిన ఉత్సాహం

‘ఓజీ’ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చిత్రబృందం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా టికెట్ ధరలను సెప్టెంబర్ 30వ తేదీ నుంచి సాధారణ (నార్మల్) స్థాయికి తగ్గించారు. సాధారణంగా భారీ చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇప్పుడు ధరలు తగ్గడంతో, ఇప్పటికే సినిమా చూసిన వారు కూడా మళ్లీ చూడటానికి, చూడని ప్రేక్షకులు వెంటనే థియేటర్లకు వెళ్లడానికి ఉత్సాహం చూపించే అవకాశం ఉంది. మరో వైపు కోర్టు కూడా టికెట్ ధరలను వెంటనే తగ్గించాలని ఆర్డర్స్ జారీ చేసిన క్రమంలో.. మంగళవారం నుంచి ఈ సినిమా నార్మల్ రేట్స్‌తోనే థియేటర్లలో రన్ అవుతోంది. ఈ తగ్గిన టికెట్ల ధరలతో ఆక్యుపెన్సీ పెరిగితే.. ఏపీలోనూ తగ్గించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆల్రెడీ ఏపీలో కూడా కొన్ని చోట్ల టికెట్ల ధరలను తగ్గించే అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమాకు కొత్త జోష్

ప్రపంచవ్యాప్తంగా సినిమాకు మరింత ఆకర్షించేందుకు సెప్టెంబర్ 30వ తేదీ ఈవినింగ్ షో నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్లలో కొత్త పాటను యాడ్ చేసినట్లగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ (Kiss Kiss Bang Bang) అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో నటి నేహా శెట్టి సందడి చేశారు. ఈ కొత్త పాటను యాడ్ చేయడం ద్వారా సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతి లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పాట విషయంలో నేహా శెట్టి (Neha Shetty) డిజప్పాయింట్ అయినట్లుగా వస్తున్న వార్తలకు కూడా మేకర్స్ చెక్ పెట్టేశారు.

Also Read- Dimple Hayathi: పెంపుడు కుక్కల వ్యవహారం.. మరో కాంట్రవర్సీలో డింపుల్ హయాతి!

సక్సెస్ సెలబ్రేషన్స్

‘ఓజీ’ ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సక్సెస్ వేడుకను భారీగా నిర్వహించనుంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్‌తో పాటు, దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్, ఇంకా ఇతర చిత్ర బృందం మొత్తం పాల్గొనుంది. టికెట్ ధరలు తగ్గడం, కొత్త పాట కలవడం, సక్సెస్ వేడుకల జోష్… ఈ అన్ని అప్‌డేట్స్‌తో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత

Local Body Elections: నోటిఫికేషన్ వచ్చేలోగా.. రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు?

Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..

Localbody Elections: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ వ్యూహం ఇదేనా?