Bigg Boss Telugu 9: నాల్గవ వారం నామినేషన్స్.. ఈ ఫైర్ ఏంటి?
Bigg Boss Telugu 9 Day 23 Promo
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: నాల్గవ వారం నామినేషన్స్.. బాబోయ్ ఈ ఫైర్ ఏంటి?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ షో (Bigg Boss Telugu Season 9) నాల్గవ వారానికి చేరుతుంది. ప్రస్తుతం హౌస్‌లో నాల్గవ వారానికి సంబంధించి నామినేషన్స్ (Bigg Boss 4th Week Nominations) జరుగుతున్నాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియ చూస్తుంటే, సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సరిపోవు అన్నట్లుగా ఉన్నాయంటే.. ఏ రేంజ్‌లో హౌస్‌లో ఫైరింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిని మించి ఒకరికి వాయిస్‌లు రేజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు హరీష్ గొంతు ఒక్కటే పెద్దగా వినిపించేది. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓ ఫైర్ బ్రాండ్‌లా మారిపోతున్నారు. ఆఖరికి కామ్‌గా ఉండే ఫ్లోరా సైనీ కూడా, ఈసారి ఫైర్ అయిందంటే.. రోజురోజుకూ బిగ్ బాస్‌‌లో హీట్ ఏ రేంజ్‌లో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక డే 23కి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ప్రతి ఒక్కరూ వారి గేమ్‌ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక్కడ గేమ్ కంటే కూడా, ప్రతి ఒక్కరూ నోటితో పడిపోతున్నారంటే బాగుంటుందేమో. ఒక్కసారి ప్రోమోని గమనిస్తే..

Also Read- Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?

డబుల్, త్రిబుల్ మీనింగ్స్ నాకు తెలియదు

ముందుగా సంజన, శ్రీజల మధ్య డిస్కషన్ నడుస్తుంది. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అనే వర్డ్.. అని శ్రీజ అంటే.. ఓపికలేని జాగా నుంచి వచ్చాను అను అని సంజన చెబుతోంది. నా ఇంటెన్షన్ అంతే ఉంది అని సంజన క్లారిటీ ఇస్తుంది. రాము, సుమన్ శెట్టి, హరీష్ మధ్య డిస్కషన్‌లో.. నేను మాట్లాడను, ఆడియెన్స్ మాట్లాడతారు అని రాము అంటుంటే.. అది చాలా తప్పు అని సుమన్, హరీష్ అతనికి చెబుతున్నారు. నాకు తెలుగులో డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్ అంటే ఏంటో తెలియదబ్బా.. అని భరణికి సంజన చెబుతోంది. నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించి పాచికలాట జరుగుతుంది. సుమన్ శెట్టి విసిరిన పాచిక ఆయనను నామినేషన్‌లోకి చేర్చినట్లుగా కనిపిస్తోంది. తనూజ కూడా అయ్యో.. అక్కడ నామినేట్ ఉంది అని అంటోంది.

Also Read- Mega OG Pic: ‘మెగా ఓజీ పిక్’.. పవన్ సినిమాపై చిరు రివ్యూ అదిరింది

అత్త మీద కోపం దుత్త మీద..

ఆ తర్వాత రీతూ చౌదరి మాట్లాడుతూ.. ‘వియ్ నామినేట్ శ్రీజ.. ఒక మనిషిని గిచ్చి.. అది నొప్పి వస్తుందా? లేదా?.. అది ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా? లేదా? అని మాట్లాడటం రాంగ్ అని నా ఫీలింగ్’ అని అంటోంది. దివ్య కలగజేసుకుని శ్రీజ పాత్ర ఇందులో ఉందని ప్రియా చెప్పే వరకు నాకు తెలియలేదని అనగానే.. శ్రీజ కల్పించుకుని, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు.. నేను మాట్లాడేది పూర్తవ్వని.. అని బిగ్గరగా అరుస్తోంది. వారిద్దరి మధ్య వాగ్వివాదం ఓ రేంజ్‌లో జరిగింది. ఫైనల్‌గా శ్రీజ నామినేట్ అయినట్లుగా చూపించారు. ఆ తర్వాత ఫ్లోరా మాట్లాడుతూ.. ఫ్రెండ్సిప్‌కు ఓ రూల్ ఉంది అని అంటుంటే.. మీతో నాకు అది అవసరం లేదని హరీష్ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాడు. మీరు నన్ను బెదిరిస్తున్నారు అని ఫ్లోరా అంటే, నీ మంచి కోరుకునే వాడిగా చెబుతున్నా అని హరీష్.. తన వాయిస్ పవర్ చూపిస్తున్నారు. సేమ్ టు సేమ్ రాముని కూడా హరీష్ వాదిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హౌస్‌లో హీట్ వెదర్ నెలకొంది. ఈ హీట్ ముదురుతున్న నేపథ్యంలో తనూజ ఒక్క నిమిషం అంటూ బిగ్గరగా అరిచేసింది. తనూజ, హరీష్‌ల మధ్య నువ్వా? నేనా? అనేలా ఫైట్ జరుగుతుంది. అంతలోనే రాము.. ‘అత్త మీద కోపం’ అంటూ ఓ సామెత పేల్చాడు. ఫైనల్‌గా హరీష్‌ను నామినేట్ చేశాడు రాము. మొత్తంగా అయితే ఈ ప్రోమోతో ఈ రోజు రాత్రికి పెద్ద యుద్ధమే జరగబోతుందని బిగ్ బాస్ హింట్ ఇచ్చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?