Muncipality corriptions jagityal
Top Stories, క్రైమ్

Telangana:జగిత్యాల మున్సిపాలిటీ ..అక్రమాలలో స్పెషాలిటీ?

  • ప్రకంపనలు సృష్టిస్తున్న జగిత్యాల భూకుంభకోణం
  • జగిత్యాల మునిసిపాలిటీ భూకుంభకోణం కేసులో ముగ్గురి అరెస్ట్
  • అమిరుద్దీన్,ముజాకీర్,మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ అరెస్ట్
  • హస్నాబాద్ లో 12 గుంటల భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు
  • కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం
  • బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం
  • ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన మునిసిపల్ కమిషనర్ అనిల్ బాబు

jagityal muncipality office staff land occupation case file:

జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. మున్సిపల్ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు జరిగిన ప్రయత్నం బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం, విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలకు సిద్ధమైంది. తాజాగా భూ కబ్జాకు ప్రయత్నించిన సూత్రధారులతోపాటు కబ్జాదారులకు సహకరించి పాత్రధారులైన జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌, మున్సిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌పై కేసులు నమోదు చేసింది. కాగా మునిసిపల్ కమిషనర్ అనిల్ బాబు,మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై 409,420,467,471,468,120(b),r/w34 ఐపీసీ క్రింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో అమిరుద్దీన్, ముజాకీర్, మున్సిపల్ రెవెన్యూ అదికారి బడుగు ప్రసాద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ పత్రాలతో కబ్జా..

జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణం హస్నాబాద్ శివారులోని సర్వే నంబర్ 1599 లోని 12 గుంటల స్థలాన్ని పట్టాదారులైన మండ పెద్ద రాజిరెడ్డి, మండ శ్రీనివాస్ నుంచి పుల్ల భాగ్యలక్ష్మి 2008 సంవత్సరంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి నుంచి కీర్తి విజయలక్ష్మి, పూటూరి గీతారాణి, గొల్లపెల్లి సత్యన్నారాయణ 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటినుంచి 12 గుంటల స్థలం వీరి ముగ్గురి ఆధీనంలోనే ఉంది. కాగా దీనిని కాజేసేందుకు జగిత్యాల పట్టణానికి చెందిన ఖాజా అమీరుద్దీన్ అలియాస్ నుమాన్, అమీరుద్దీన్ స్నేహితుడు ఎండి ముజాకిర్ అలీ అలియాస్ హిలాల్ సుల్తాన్, జగిగ్యాల పట్టణానికి చెందిన ఎండి ఇమ్రాన్ కలిసి 12 గుంటల స్థలానికి సంబంధించిన సాదా బైనామా, నకిలీ 12 బీ, 13 సీ, మ్యాపులు క్రియేట్ చేశారు. తర్వాత జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆర్ ఓ గా పనిచేస్తున్న బడుగు ప్రసాద్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ అనిల్ సహకారంలో నకిలీ ఇంటి నంబర్, ప్రాపర్టీ అసెస్ మెంట్ పత్రాలు, వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ ఐడీ నంబర్ పత్రాలు సృష్టించారు.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?