Thaman and Charan
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కొట్టావా థమన్.. ‘ఓజీ’ మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. ఆయన ఒక మాట అంటే, అందరూ దానిని వేరేలా ప్రొజక్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఆయనని అపార్థం చేసుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. కానీ ఒక్క హుక్ స్టెప్ కూడా లేదని, కొరియోగ్రాఫర్స్‌ని టార్గెట్ చేస్తూ థమన్ అంటే.. అదేదో రామ్ చరణ్‌ని అన్నట్లుగా అంతా ఫీలయ్యారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ‘ఓజీ’ సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఇందులో ‘గేమ్ ఛేంజర్’ కాంట్రవర్సీతో పాటు, ‘ఓజీ’ సినిమాపై రామ్ చరణ్ రియాక్షన్ కూడా ఆయన తెలియజేశారు.

Also Read- Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెసుసా?

నేను కొరియోగ్రాఫర్స్‌ని అంటే..

ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన ‘కోర్టు’ సినిమాలో ‘కథలెన్నో చెప్పారు’ సాంగ్ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లింది. ‘అల వైకుంఠపురములో’, ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలలో ఉన్న హుక్ స్టెప్స్.. సినిమా విడుదలకు ముందే, ఆయా సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లాయి. ఈ మధ్య జనాలందరూ రీల్సే చూస్తున్నారు. హుక్ స్టెప్స్ రీల్స్‌కు బాగా ఉపయోగపడతాయి. రామ్ చరణ్ వంటి డ్యాన్సర్‌పై ఒక్క హుక్ స్టెప్ కూడా పెట్టకపోవడంతో నాకు బాధేసింది. ‘నాయక్‌’ సినిమాలో ‘లైలా ఓ లైలా’ కానీ, ‘బ్రూస్‌లీ’ సినిమాలోని ‘ మెగా మీటర్‌’ వంటి ఎన్నో పాటలకు చరణ్ అద్భుతంగా స్టెప్పులేశారు. అలాంటి గొప్ప డ్యాన్సర్‌కు ‘గేమ్ ఛేంజర్’లో కొరియోగ్రాఫర్లు సరైన మూమెంట్స్‌ ఇవ్వలేదని నేను అంటే, హీరోని టార్గెట్‌ చేసి నేను మాట్లాడానని కొందరు అపార్థం చేసుకున్నారు. రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ టాలెంట్‌ను ఆ సినిమాకు సరిగా వాడుకోలేకపోయారని నేను చాలా బాధపడ్డానని థమన్ అన్నారు.

Also Read- Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?

కిరోసిన్ పూసుకుని కొట్టావా..

ఇక ‘ఓజీ’ సినిమాపై రామ్ చరణ్ తనకు ఫోన్ చేశారని చెప్పిన థమన్.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి.. ప్యూర్ హార్ట్. అందుకే నేను మెగా హార్ట్ స్టార్ అని పిలుస్తుంటాను. ‘ఓజీ’ సినిమా మ్యూజిక్ విని, చరణ్ ఫోన్ చేసి అభినందించారు. ఫైర్ మోడ్ థమన్.. చేతులకు కిరోసిన్ పూసుకుని సంగీతం కొట్టావా? అని అడిగారని, మ్యూజిక్ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పారని అన్నారు. మేమిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటాం. కావాలనే, కొందరు నెగిటివ్‌గా విషయాన్ని తీసుకెళ్లారు. మేం మాత్రం హ్యాపీగానే ఉన్నామని అన్నారు. థమన్ సంగీతం అందించిన ‘ఓజీ’ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan: చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కొట్టావా థమన్.. ‘ఓజీ’ మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి వచ్చేది ఎప్పుడంటే..

KTR: జూబ్లీహిల్స్‌లో టూరిస్ట్ మంత్రుల ఎన్నికల ప్రచారం.. ఎన్నికలు అయిపోగానే గాయబ్!

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం