Chiranjeevi Tollywood
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?

Tollywood: దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) తర్వాత టాలీవుడ్‌కు ఏదైనా సమస్య వస్తే.. సాల్వ్ చేసుకోవడానికి ఎవరి గుమ్మం తొక్కాలి? అంటే అందరూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంటివైపే చూస్తారు. కారణం, అంతటి సామర్థ్యం ఉన్న నాయకుడు ఆయనే కాబట్టి. సమస్య ఏదైనా, దానిని సాల్వ్ చేసే విషయంలో అందరినీ కలుపుకుని వెళ్లగల నేర్పరితనం చిరంజీవిలోనే ఉంది. అయితే దీనిని ఆయన పెద్దరికంగా అనుకోవడం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కూడా పలు సందర్భాలలో.. చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ.. ‘పరిశ్రమ పెద్ద’ అంటే ఆయనకు నచ్చదు… ‘పరిశ్రమ బిడ్డ’గా మాత్రమే ఆయన అన్నీ చేస్తున్నారని ప్రస్తావించారు. అలాగే చిరంజీవి కూడా.. ఇద్దరి మధ్య తగాదాలు తీర్చే పెద్దరికం నాకు వద్దు.. ఎవరైనా కష్టాల్లో ఉండే మాత్రం.. వారికి నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. అంటే, చిరంజీవి పెద్దరికం కోరుకోవడం లేదు.. కానీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంటే మాత్రం ఆయన ఎంత వరకు అయినా వెళతారు? ఎన్ని అవమానాలైనా భరిస్తారు? అందుకు పలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి.

చిరంజీవి ఎక్కడా చెప్పలేదు.. చెప్పడు కూడా.

ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, పరిశ్రమ నుంచి కొందరు చిరంజీవిని తీసుకుని వెళ్లి ఆయనని కలిశారు. అప్పుడు చిరంజీవి, ఇండస్ట్రీపై కఠినంగా వ్యవహరించవద్దు. దయచేసి, కాస్త చూసీచూడనట్లుగా ఉండండి అని చేతులు జోడించి అడిగారు. దీనికి జగన్ నవ్వుతూ కూర్చున్నాడు తప్పితే.. అయ్యో అదేంటి అన్నా? దీనికి మీరు ఇంతగా అడగాల్సిన అవసరం ఏముంది? అని అన్నట్లుగా స్వయంగా వారు విడుదల చేసిన వీడియోలో కూడా కనిపించలేదు. మరి ఇది అవమానం కాక ఇంకేమిటి? ఆర్ నారాయణమూర్తి (R Narayana Murthy) వంటి వారికి ఇది అర్థం కావడం లేదు. అసలు ఆ రోజు జగన్ (YS Jagan) ఎవ్వరినీ అవమానించలేదు అని మాట్లాడుతున్నారు. చిరంజీవి వంటి వ్యక్తితో దండం పెట్టించుకునే స్థాయికి ఇండస్ట్రీని దిగజార్చింది ఎవరు? ఇండస్ట్రీని ఇబ్బందులు పెట్టింది ఎవరు? రూ. 10కు టికెట్లను అమ్మించి, ఇండస్ట్రీని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చూసింది ఎవరు? అసలు ఎప్పుడు బయటకు రాని మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారిని రప్పించుకుంది ఎవరు? వీటన్నింటిని పక్కన పెట్టి, అసలు ఆ రోజు అవమానమే జరగలేదు అనడానికి ఆర్ నారాయణమూర్తికి నోరెలా వచ్చిందో మరి.

Also Read- Puri Jagannadh: తమిళనాడులో తొక్కిసలాట.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం

అందుకే పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు

ఇక చిరంజీవి సంగతి అంటారా? ఆయనకు భరించడం అలవాటైపోయింది.. కానీ, అసెంబ్లీలో తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంటే.. దానిని సరిదిద్దే క్రమంలో ఆయన లేఖను విడుదల చేయక తప్పలేదు. భరించే వాడేకే అన్ని అన్నట్లుగా.. ఆ రోజు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఈ రోజు ఎందుకు లెటర్ విడుదల చేశారు? అని కొందరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. నాకు అవమానం జరిగింది? అని, ఇప్పటి వరకు చిరంజీవి ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే, అసలు ఆయన దానిని అవమానంగా భావించలేదు. ఇండస్ట్రీ క్షేమం కోసం చేసిన పనిగానే చూస్తున్నారు. కానీ, ఆ సంఘటనను వీడియోలో చూసిన వారంతా, చిరంజీవికి, ఇండస్ట్రీకి జరిగిన అవమానంగానే భావించారు. అందుకే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్స్ పేలుస్తున్నారు.

పర్సనల్ ఈగో

ఇక బాలకృష్ణ (Balakrishna) విషయానికి వస్తే.. ఆయన మొదటి నుంచి చిరంజీవి ఆధిపత్యాన్ని తట్టుకోలేరు. పైకి స్నేహితులం అని చెబుతూనే ఉంటాడు కానీ, చిరంజీవిని చాలా సందర్భాల్లో అవమానిస్తూనే ఉన్నాడు. అయినా, చిరంజీవి తన తోటి నటుడు అని భావిస్తూ, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని సర్దుకుపోతున్నారు. కానీ, ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన చోట, పర్సనల్ ఈగోకు పోయి, వాడు-వీడు అనడం చిరంజీవికి కూడా నచ్చలేదు. అందుకే ఆ లేఖలో సీఎం అయినా, సామాన్యులనైనా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతానని, తన అసహనాన్ని ప్రదర్శించారు. ఇంతకు ముందు ఎప్పుడూ చిరంజీవి ఇలా రియాక్ట్ కాలేదు. చిరంజీవి అంటే అటు బాలకృష్ణకి అయినా, ఇటు మోహన్ బాబు లాంటి వారికైనా ఒక్కటే మంట.. టాలీవుడ్ పెద్దరికం. టాలీవుడ్ జనాలు చిరంజీవి దగ్గరకే ఎందుకు వెళుతున్నారు? మా దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని అక్కసు అంతే. చిరంజీవిని అంతా గౌరవంగా చూడటం జీర్ణించుకోలేక అసూయపరులై, అక్కసు వెళ్లగక్కుతుంటారు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

ఇండస్ట్రీ‌కి సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నారు?

సరే, పెద్దరికం కావాలి అనుకున్నప్పుడు.. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు టక్కున ముందుకు వస్తారా? అంటే రానే రారు. మరి ఎలా వారికి పెద్దరికం దక్కుతుంది? అని సినీ పరిశ్రమలోని వారే బాహాటంగా ఈ మాటలను అంటుండటం గమనార్హం. ఇండస్ట్రీ‌కి సమస్య వచ్చినప్పుడు.. ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఏమైనా కలగజేసుకున్నాడా? ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడేగా? అసలు చిరంజీవితో పనేముంది? బాలయ్యే ఈ సమస్యను చక్కబెట్ట వచ్చుగా. అందులోనూ అప్పటి సీఎం జగన్ కూడా తన అభిమానే అని ప్రగల్భాలు పలికారు కదా. మరి అలా ఎందుకు చేయలేదు? ‘అఖండ’ సినిమాకు పర్సనల్‌గా ఫోన్ చేసి టికెట్ల ధరలను పెంచాలని అడగడం ఏంటి? ఇది స్వార్థం కాదా? ఇక్కడ పరిశ్రమ గురించి ఎందుకు పట్టించుకోలేదు? దీనిని ఎందుకు ఎవరూ హైలెట్ చేయడం లేదు. వైఎస్ జగన్ అంటే అప్పట్లో భయపడ్డారా? అందరిని కలుపుకుని వెళ్లి క్రెడిట్ కొట్టేయవచ్చు కదా. అలా ఎందుకు చేయలేదు?

9వ స్థానం కాక ఎంత ఇవ్వాలి?

చిరంజీవి దండం పెట్టి అడిగినప్పుడు.. అంత ప్రాధేయపడాల్సిన అవసరం లేదని, ఒక్క పవన్ కళ్యాణ్, నాని తప్పితే.. ఇంకా ఎవరైనా నోరు విప్పారా? అంత భయమా? చిరంజీవి మౌనముని కాబట్టి.. ఏమన్నా పడతాడని అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా నా పేరు 9వ ప్లేస్‌లో వేశారు అని బాలయ్య బాధపడుతున్నాడు కదా.. ఏనాడైనా ఈ సమస్య నాది అని ముందుకు వచ్చి ఉంటే కదా.. మొదటి స్థానం దక్కేది? నువ్వేమో షూటింగ్స్‌తో బిజీగా ఉండి ఫోన్లు లిఫ్ట్ చేయవు. కనీసం సమాధానం ఇవ్వనంత బిజీ మరి. అలాంటప్పుడు స్థానం గురించి మాట్లాడటం హక్కు ఉందా? అని బాలయ్యపై నెటిజన్లు కొందరు విరుచుకు పడుతున్నారంటే.. ఈ విషయంలో ఆయన ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా చంద్రబాబు వంటి పెద్దలు బాలయ్య నోటికి మూత వేస్తే బాగుంటుంది.. లేదంటే ఎవరికి నష్టమో? స్పష్టంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Janagama: మూడు సీట్లు..! ఆరు నోట్లు..! స్థానిక ఎన్నిక‌ల‌పై బెట్టింగ్‌ల జోరు

Bathukamma Kunta: బతుకమ్మకుంట ప్రారంభం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana Education: విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్.. ప్రతి క్లాసుకు 2 కాపీల చొప్పున పంపిణీ